తకిట తకిట సినిమా తో తెలుగు తెరకి పరిచయమైంది హరిప్రియ. అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్ సినిమా తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలన్న కల కలగానే మిగిలిపోయింది. అయితేనేం ఈ బెంగళూరు బ్యూటీ క్షణం కూడా తీరిగ్గా లేదు. రెగ్యులర్ గా కన్నడ సినిమాల షూటింగుల్లో పాల్గొంటోంది. ఇదిగో ఉన్నట్టుండి ఓ చోట అడ్డంగా దొరికిపోయిందిలా.
ఇటీవలే ఓ కన్నడ సినిమా షూటింగ్ కోసం పొలం గట్ల వెంబడి వెళుతుంటే.. అక్కడ ఓ దృశ్యం ఈ అమ్మడిని కట్టిపడేసింది. ఓ ఎద్దు ఓ పొడవాటి క్రేన్ వంటి మెచీన్ ని లాగుతోంది. ఆ మెచీన్ తిరుగుతుంటే ఆ చక్రాల పంటి మధ్య చెరుకు గడలను జొప్పించి రసం తీస్తున్నాడో ఆసామి. ఆ పాతకాలం టెక్నాలజీ చూసి.. హరిప్రియ వెంటనే ఎగిరి గంతేసింది. అంతేనా అక్కడ పర్మిషన్ తీసుకుని చెరుకు నుంచి రసం పిండే పనిలో పడింది. చెరుకు గడల్ని మిషన్ లో వేసి రసం తీసింది. అంతేనా ఇదిగో ఇక్కడ ఐ యామ్ కాంప్లాన్ గాళ్ అన్న చందంగా ఐ యామ్ సుగర్ కేన్ జూస్ గాళ్ అంటూ ఫోజులిస్తోందిలా.