మ‌హేష్ క్యూలో ఫ‌న్ డైరెక్ట‌ర్

Update: 2019-01-19 05:27 GMT
ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు అనీల్ రావిపూడి. అప్ప‌టికే హిట్టు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరోల‌కు హిట్లిస్తున్నాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కి స‌రైన టైమ్ లో `ప‌టాస్` లాంటి హిట్టిచ్చి ఆదుకున్నాడు. ఆ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు `రాజా ది గ్రేట్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని స‌రైన టైమ్ లోనే ఇచ్చాడు. సాయిధ‌ర‌మ్‌ తో` సుప్రీం` లాంటి హిట్ సినిమాని తీశాడు. తాజాగా సంక్రాంతి బ‌రిలో `ఎఫ్ 2` చిత్రంతో వెంకీ, వ‌రుణ్ ఇద్ద‌రికీ కెరీర్ పాత్ బ్రేకింగ్ హిట్ ని ఇచ్చాడు.

`ఎఫ్ 2- ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్` సంక్రాంతి బ‌రిలో ఏకైక బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది. రామ్‌ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌`, ఎన్టీఆర్ - క‌థానాయ‌కుడు చిత్రాలను బాక్సాఫీస్‌ రేసులో వెన‌క్కి నెట్టి హిట్ కొట్టింది ఎఫ్ 2. ఈ విజ‌యం అనీల్ రావిపూడిలో జోరు పెంచిందిట‌. త‌దుప‌రి అత‌డి ప్లానింగ్స్ పెద్ద రేంజులోనే ఉన్నాయ‌ని తెలుస్తోంది. అనీల్ ప్ర‌స్తుతం ఓ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఈ స్క్రిప్టుని సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి వినిపిస్తాడ‌ట‌.

మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న మ‌హేష్ త‌దుప‌రి సుకుమార్ వినిపించే స్క్రిప్టు  వినాల్సి ఉంది. అలాగే అనీల్ రావిపూడి స్క్రిప్టును వింటాడు. మ‌హేష్ కెరీర్ 26వ సినిమా సుకుమార్ తో ఉంటుంది. ఆ త‌ర్వాత న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలివ్వాల‌ని అనుకుంటున్నాడు. అనీల్ రావిపూడికి ఛాన్స్ ఉంటుంద‌న్న మాటా వినిపిస్తోంది. అనీల్ రావిపూడి అంటే హాస్య ర‌సం, ఫ‌న్, ఎమోష‌న్స్ కి ప్రాధాన్య‌త ఉంటుంది కాబ‌ట్టి మ‌హేష్ కి ఈ త‌ర‌హా జోన‌ర్‌ ఆట‌విడుపుగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదివ‌ర‌కూ కామెడీ జోన‌ర్ సినిమాల‌కు శ్రీ‌నువైట్లను ఆశ్ర‌యించిన మ‌హేష్ ఈసారి అనీల్ రావిపూడిని ఆశ్ర‌యించాల్సి ఉంటుంది. ఈ ఆలోచ‌న యువ‌ద‌ర్శ‌కుడికి క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం స్క్రిప్టు రెడీ అవుతోంది. అన్నీ అనుకూలిస్తే మ‌హేష్ 27వ సినిమాకి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే వీలుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. 


Full View
Tags:    

Similar News