`ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` టైపా?!

Update: 2019-06-01 10:25 GMT
ర‌విబాబు `నువ్విలా` సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు హ‌వీష్‌. తొలి సినిమా పెద్ద హిట్. హ‌వీష్ న‌ట‌న‌కు పేరొచ్చింది. అయితే అప్ప‌టికే కె.ఎల్‌.యూనివ‌ర్శిటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా హ‌వీష్ ఓవైపు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే రంగుల ప్ర‌పంచంలో హీరోగా త‌న‌ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. జీనియ‌స్- రామ్ లీల సినిమాల్లో న‌టించినా అవేవీ హిట్లు కాక‌పోవడంతో కొంత గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం `7` అనే థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. అస‌లు ఈ సినిమా క‌థాక‌మామీషు ఏంటి? 7 వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏమిటి? ఎందుకు కెరీర్ ప‌రంగా ఇటీవ‌ల గ్యాప్ వ‌చ్చింది? వ‌ంటి విష‌యాల‌పై తాజా ఇంట‌ర్వ్యూలో హ‌వీష్‌ స‌మాధానాలిచ్చారు.

వాస్త‌వానికి 7 మూవీ టీజ‌ర్ విజువ‌ల్స్ చూసి `ఎర్ర‌గులాబీలు` త‌ర‌హా అనుకుంటున్నారు. థ్రిల్ల‌ర్ అన‌గానే డ్రైగా.. గ్రీనిష్ గా ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. ల‌వ్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స‌ర‌దాగా జాలీగానూ ఉంటుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర‌హాలో అన్ని అంశాలు ఉన్న చిత్ర‌మిద‌ని నేను  తొలి నుంచి చెబుతున్నా. ఇక సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు కాబ‌ట్టి అస్స‌లు డ్రైగా ఉండ‌దు. గ్లామ‌ర్ కంటెంట్  కి కొద‌వేమీ లేదు.. అని తెలిపారు. అస‌లు 7 టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు?  దాని అర్థం ఏంటి? అని అడిగేస్తే .. రెహ‌మాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడు పాత్ర‌లు అని అర్థం. ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌ని రెహ‌మాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేస్తే మిగిలింది ఏడుగురే క‌దా! అని అన్నారు.

క‌థాంశం యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న‌ది. బాలీవుడ్ .. హాలీవుడ్ .. క‌న్న డ అనే తేడా లేకుండా ఎక్క‌డైనా వ‌ర్క‌వుట‌వుతుంది.  నా స‌న్నిహితుల్లో ఓ త‌మిళియ‌న్ చూసి ఎక్క‌డో కాపీ కొట్టారు అన్నారు. అంత‌గా అత‌డికి న‌చ్చేసింది. ఇందులో ఎగ్జ‌యిట్ చేసే ట్విస్టులుంటాయి. ఏదో ఒక ట్విస్టు కాదు.. 15-20 నిమిషాలు క‌థ‌లోకి వెళ్లిన‌ త‌ర్వాత థ్రిల్ అయ్యి సీటు అంచున కూచుని చూస్తారు... అని తెలిపారు. ఈ సినిమాకి ఆరుగురు క‌థానాయిక‌లు ఎందుకు అంగీక‌రిస్తారు? .. త‌మ‌ పాత్ర‌లు న‌చ్చ‌డం వ‌ల్ల‌నే . నా సెట్ లో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటేనే భ‌యం. బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్టం. ఒక‌రితో ఒక‌రికి కుద‌ర‌దు క‌దా! కానీ వారి వ‌ల్ల గ్లామ‌ర్ పెరిగింది మూవీకి.. అన్నారు.

ఒక‌రు కాదు ఆరుగురితో ఎలా మ్యానేజ్ చేశారు? అంటే.. ``హీరోయిన్ ని ప‌ట్టుకోవ‌డం అంటే క‌ష్టం. ఒక హ‌రోయిన్ కి అల‌వాటు ప‌డే లోపే హీరోయిన్ ని మార్చేసేవారు. అందువ‌ల్ల క‌ష్టం అయ్యింది సోద‌రా!`` అంటూ స‌ర‌దాగా న‌వ్వేశారు హ‌వీష్‌. రామ్ లీల త‌ర్వాత‌ ఎందుకింత గ్యాప్ వ‌చ్చింది? అని ప్ర‌శ్నిస్తే మ‌ధ్య‌లో ఓ పెద్ద సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ ఎందుక‌నో కుద‌ర‌లేదు. దాంతో గ్యాప్ క‌నిపించింది. పెద్ద సినిమా మిడిల్ డ్రాప్ అవ్వాల్సొచ్చింది. అలాగ‌ని ఏదో ఒక‌టి ఓకే చెప్పి సినిమా చేసేస్తే అది పోయినా ఇంకే నిర్మాత‌ల‌కు గుర్తుండ‌ను. మామూలు చిన్న కెమెరాల‌తో పిచ్చి సినిమాలు తీసేవాళ్లు ఉన్నారు. అవి నాకు న‌చ్చ‌వు. అందుకే చేయ‌లేదు. అలాగే నేను అస్స‌లు హారర్ థ్రిల్ల‌ర్ చేయాల‌ని అనుకోలేదు. కానీ 7 థ్రిల్ల‌ర్ న‌చ్చింది. చేశాను.. అని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అభిషేక్ -  బెక్కం వేణుగోపాల్- ట్రైడెంట్ ర‌వి వీళ్ల బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేస్తున్నాను... అని తెలిపారు.


Tags:    

Similar News