ఆమెతో డేటింగ్ ఓ అనుభూతి.. ప్రైవసీగా ఉంచుతా: యువహీరో

Update: 2021-03-17 11:59 GMT
సినీతారల మధ్య అఫైర్స్ అనేవి ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే తమ అభిమాన హీరో, హీరోయిన్లు ఎవరితో డేటింగ్ చేస్తున్నారో.. ఏ హీరోతో లవ్ లో ఉన్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. బాలీవుడ్ హాట్ భామ కత్రినా కైఫ్ పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈమద్యే కత్రినా ఇంటికి ఓ యంగ్ హీరో అర్థరాత్రి వేళలో ప్రవేశించాడు. ఆ హీరోతో కత్రినా నైట్ మీటింగ్ విషయం సోషల్ మీడియాలో అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చర్చలకు దారితీసింది. అయితే ఎలాగో ఈ విషయం బయటికి రావడంతో కత్రినాకు ఆ హీరోకి మధ్య బలమైన విషయం దాగి ఉందని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఆ యువహీరో ఎవరో కాదు.. లస్ట్ స్టోరీస్ ఫేమ్ విక్కీకౌశల్. వీరిద్దరూ గతకొంత కాలంగా చాలా సన్నిహితంగా మెలుగుతూ కెమెరాల కంటపడ్డారు. అప్పటినుండి వీరి మధ్య సంథింగ్ ఉందని టాక్. అయితే తాజాగా హీరో విక్కీ.. ఈ వార్తలపై స్పందించాడు. ఎవరైనా ఫేమ్ వచ్చిన తర్వాత జీవితం పబ్లిక్ చేతుల్లోకి వెళ్లడం మాములే. కానీ పర్సనల్ లైఫ్ గురించి.. ప్రేమించిన వారి గురించి బహిరంగంగా మాట్లాడటం సరైనది కాదనేది నా అభిప్రాయం అంటూ హీరో చెప్పుకొచ్చాడు. కానీ హీరో ఏ విషయం అనేది తేల్చలేదు. డేటింగ్ అనే విషయం ఇదివరకే ఒప్పుకున్నాడు. కానీ డేటింగ్ అనేది ఓ అందమైన అనుభూతి మాత్రమే అంటూ చెప్పడంతో ఫ్యాన్స్, ఇండస్ట్రీలో ఈ జంట హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. చూడాలి మరి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమో!


Tags:    

Similar News