తమిళ స్టార్ హీరో విజయ్ కొన్ని నెలల క్రితమే 'సర్కార్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సర్కార్ చిత్రంతో విజయ్ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్కార్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో విజయ్ తదుపరి చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విజయ్ తదుపరి చిత్రం వస్తుందా, దాన్ని అప్ డేట్స్ ఏంటా అంటూ ఎదురు చూస్తున్న ఇళయదళపతి అభిమానులకు ఆసక్తికర అప్ డేట్ తమిళ సినీ వర్గాల ద్వారా అందింది.
ఇప్పటికే విజయ్ 63వ సినిమాకు అట్లీ కుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. క్రీడా నేపథ్యంలో అంటూ ముందే హింట్ ఇచ్చారు. తాజాగా ఫుట్ బాల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని, ఈ చిత్రానికి 'మైఖేల్' అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయ్, అట్లీల కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్స్ అవ్వడంతో పాటు వివాదాలకు కూడా కేంద్ర బిందువు అయ్యాయి. అలాగే ఈ చిత్రం కూడా వివాదాన్ని రాజేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండియాలో క్రీడాకారులకు గుర్తింపు ఇవ్వకుండా రాజకీయాలు చేసే వారికి వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రాబోయే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మరో విజయాన్ని విజయ్ కి ఇస్తుందో చూడాలి.