కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ఒకలా.. అవకాశాలు లేనపుడు మరొకలా రెమ్యూనరేషన్ తీసుకోవడం అనే ట్రెండ్ గతం నుంచి నడుస్తున్నదే. చేతిలో సినిమాలు లేనపుడు డిస్కాంట్స్ ఇవ్వడం ద్వారా మంచి ప్రాజెక్టులు ఒడిసిపట్టుకుని.. మళ్లీ ఫామ్ లోకి వచ్చాక రేటు పెంచుకోవడం చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో సహజంగా ఇదే జరుగుతూ ఉంటుంది.
కానీ ఓ ముగ్గురు హీరోయిన్స్ మాత్రం.. హిట్లు-ఫ్లాపులతోనే కాదు.. అసలు చేతిలో సినిమాలున్నా లేకపోయినా తమ పారితోషికంలో పైసా కూడా తగ్గేది లేదని తేల్చేస్తున్నారు. టాలీవుడ్ స్వీటీ అనుష్క చేతిలో ఇప్పుడు భాగమతి తప్ప మరో సినిమా లేదు. అమ్మడు భారీగా సైజు పెరిగిపోవడంతో.. గ్లామర్ కేరక్టర్స్ వస్తాయనే హోప్స్ కూడా తక్కువే. అయినా సరే.. తాను గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్నే డిమాండ్ చేస్తోందట. చందమామ కాజల్ సంగతి సరే సరి. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత అమ్మడి జోరు మరింతగా పెరిగింది. తేజ డైరెక్షన్ లో రానాతో నేనే రాజు నేనే మంత్రి మినహాయిస్తే.. మరో మూవీలేదు. ఈమె గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అడుగుతుండడం విశేషం.
మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి మరొకలా ఉంది. సినిమాకి కోటి.. స్పెషల్ సాంగ్ 50 లక్షలు వసూలు చేయడం అమ్మడికి అలవాటు. బాహుబలి2 సక్సెస్ క్రెడిట్ అందుకోలేకపోయిన తమ్మూ కూడా.. గతంలో కంటే ఎక్కువే డిమాండ్ చేస్తోందట. ఒక సినిమా హిట్ పడగానే కోటి వరకూ కొత్త అమ్మాయిలు పుచ్చుకుంటున్న తరుణంలో.. తాము రేటు తగ్గిస్తే.. చులకన అయిపోతామనే ఫీలింగ్ తోనే.. ఇలా ఈ భామలు కొండెక్కి కూచున్నారని చెబుతున్నారు సినీ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/