సినిమాలో యాస అనేది ఒక అంతర్భాగం. ఆంధ్రా యాస ఏరియా వైజ్ మాండలికాల్ని ఉపయోగించడమే కాదు... నైజాం యాసను కూడా చాలా సంవత్సరాలుగా విరివిగానే వినియోగిస్తున్నారు. అసలు తెలంగాణ యాస భాష ను అవహేళన చేసేందుకే ఆంధ్రా సినిమావోళ్లు ప్రయత్నిస్తుంటారని విమర్శించినా కానీ.. ఇప్పుడు ఆ పరిధిలో ఈ వ్యవహారం లేదు. తెలంగాణ యాస దాని ఉనికిని కాపాడుకునే స్థాయిలోనే ఉంది. శేఖర్ కమ్ముల సహా పలువురు నవతరం ట్యాలెంట్ తెలంగాణ యాసను ఎంతో హుందాగా ఉపయోగిస్తున్నారు. ఒక ప్రాంతంపై దుగ్ధ చూపించేవాళ్లు ఇప్పుడు లేనే లేరు.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరి లో నైజాం యాసకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇందులో హీరో నాగచైతన్య నైజాం యాసలోనే మాట్లాడతారు. అలాగే తెలంగాణకు చెందిన జ్వాలా రెడ్డిగా తమన్నా నైజాం యాసతో అదరగొట్టనున్నారని సీటీమార్ టీమ్ వెల్లడించింది. ఈ రెండిటికీ భిన్నంగా టక్ జగదీష్ లో నాని ఆంధ్రా యాసను మాట్లాడతారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రంలోనూ తెలంగాణ యాసకు ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం నాని యాస భాష ఇక్కడి వ్యవహారికాన్ని ఎంతో గౌరవంతో నేర్చుకుంటున్నాడు. గ్రామీణ తెలంగాణకు చెందిన యువకుడిగా నాని ఈ చిత్రంలో నటించాల్సి ఉండగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భాషను మాండలికాన్ని సంగ్రహిస్తున్నాడు. అంతకుముందు కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నాని ఒక పాత్రలో రాయలసీమ మాండలికంలో మాట్లాడారు.
స్టార్ హీరోలంతా ఇదే దారిలో..!
గుణశేఖర్ తెరకెక్కించిన `రుద్రమదేవి` చిత్రంలో గోనగన్నారెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారియర్. అల్లు అర్జున్ తెలంగాణ యాసను మాట్లాడారు. నితిన్.. విజయ్ దేవరకొండ.. దాసు విశ్వక్ లాంటి స్థానిక హీరోలు స్వతహాగానే నైజాం యాక్సెంట్ ని అనర్గళంగా మాట్లాడతారు. హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నైజాం యాసను అద్భుతంగా మాట్లాడారు. నితిన్ -రామ్-నిఖిల్- దేవరకొండ - విశ్వక్ సేన్ వంటి స్టార్లు నిరంతరం నైజాం బేస్డ్ సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి యాస భాషను ప్రతిబింబిస్తున్నారు. శేఖర్ కమ్ముల ప్రతిసారీ నైజాం యాసకు ప్రాధాన్యతనిచ్చే స్థానిక సినిమాని తీసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది కూడా నైజాం భాషను బతికిస్తోంది.
చిరంజీవి సహా ఎందరో స్టార్లు నైజాం యాసను తమ సినిమాల్లో మాట్లాడారు. పూరి జగన్నాథ్ .. ఆర్జీవీ.. కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్లు రెగ్యులర్ గా తెలంగాణ యాసను తమ సినిమాల సంభాషణల్లో ఉపయోగిస్తుంటారు.
ప్రస్తుతం రిలీజ్ ల డైలమా!
నాని నటించిన టక్ జగదీష్.. చైతన్య లవ్ స్టోరి సెకండ్ వేవ్ ముందే రిలీజ్ కావాల్సినవి. కానీ అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు రిలీజ్ చేద్దామంటే ఏపీలో టిక్కెట్టు ధరల సవరణతో కిట్టుబాటు కాని దుస్థితి ఉందని చెబుతున్నారు.