ప్ర‌భాస్ ని కెలికి చీవాట్లు తిన్నాడు.. ఇంకా బుద్ధి రాలేదా?

Update: 2020-05-22 06:00 GMT
నోరు పారేసుకోవ‌డం .. చీవాట్లు తిన‌డం .. ఇది కొంద‌రి హ్యాబిట్. ఈ కోవ‌కే చెందుతాడు బాలీవుడ్ క్రిటిక్.. న‌టుడు.. నిర్మాత కే.ఆర్.కె. ప్ర‌తిసారీ స్టార్ల‌పై ఇష్టానుసారం వ్యాఖ్యానించ‌డం అటుపై అభిమానుల‌తో చీవాట్లు తిన‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇంత‌కుముందు డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన `సాహో` చిత్రంపై చెత్త రివ్యూ రాశాడు. సామాజిక మాధ్య‌మాల్లో పాపులారిటీ కోసం స్టార్ల‌ను డీగ్రేడ్ చేస్తూ రాసే ఆయ‌న ప్ర‌భాస్ పైనా అదే తీరుగా నోరు పారేసుకున్నాడు. పైగా ప్ర‌భాస్ పై అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు చేసి తిట్లు తిన్నాడు. అయితే అత‌డి విష‌యంలో ప్ర‌భాస్ మాత్రం అస్స‌లు స్పందించ‌లేదు క‌దా క‌నీసం ప‌ట్టించుకున్న‌దే లేదు.

కేవ‌లం ప్ర‌భాస్ మాత్ర‌మేనా? అంటే.. కింగ్ ఖాన్ షారూక్ .. అమీర్ ఖాన్ స‌హా ఎంద‌రినో అత‌డు తూల‌నాడాడు. తాజాగా కొద్దిరోజుల క్రితం‌ మ‌ర‌ణించిన స్టార్ల‌పైనా అనుచిత వ్యాఖ్య‌లు చేసి బుక్క‌య్యాడు. ఈసారి ఏకంగా పోలీస్ కేసు న‌మోదైంది. ఎఫ్‌.ఐ.ఆర్ ఫైల్ చేశార‌ని తెలుస్తోంది. ఇంత‌కీ అత‌డు ఈసారి ఎవ‌రిని కెలికాడు? అంటే.. ఇటీవ‌లే అనారోగ్యంతో మ‌ర‌ణించి ప్ర‌ముఖ స్టార్లు రిషీక‌పూర్.. ఇర్ఫాన్ ఖాన్ ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం వేడెక్కించింది.

ముఖ్యంగా దివంగ‌త సూప‌ర్‌ స్టార్ రిషీక‌పూర్ ని ఉద్ధేశించి దారుణ వ్యాఖ్య‌ల్ని అత‌డు సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. ``వైన్ షాపులు త్వరలో తెరవబడుతున్నందున ఆయ‌న ఇలా చనిపోకూడదు`` అని వెకిలిగా ట్వీట్ చేశాడు. అంటే రిషీక‌పూర్ తాగుబోతు అనే అర్థం స్ఫురించింది క‌మ‌ల్ ఆర్‌.ఖాన్ వ్యాఖ్యానంలో. దీంతో ఫ్యాన్స్ అత‌డిపై ఫైర్ అవుతున్నారు. రిషీజీ గత నెలలో క్యాన్సర్ ‌తో మరణించిన సంగ‌తి తెలిసిందే.

ముంబై మీడియా కథనాల ప్రకారం.. రిషీజీ చివరి శ్వాస తీసుకోవడానికి ఒక రోజు ముందు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ (ఒక‌రోజు ముందే మ‌ర‌ణం) ను కూడా కేఆర్కే అవమానించాడు. అత‌డిని అవ‌మానిస్తూ దుష్ట వ్యాఖ్యలు చేయ‌డంతో అత‌డిపై ఎఫ్‌.ఐ.ఆర్ దాఖలైందని... యువసేన కోర్ కమిటీ సభ్యుడు రాహుల్ కనాల్ ... ఒక సీనియర్ పోలీసు అధికారి ఆ విష‌యాన్ని ధృవీకరించారు. ``సెక్షన్ 294 (అశ్లీల చర్యలకు లేదా బహిరంగ దుర్భాష‌కు శిక్ష) .. ఐపీసీలోని ఇతర నిబంధనల ప్రకారం మరణించిన నటుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కమల్ ఆర్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసామ‌ని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు కేఆర్కేను పోలీసులు అరెస్టు చేయలేదు. అనారోగ్యం కారణంగా కన్నుమూసిన నటులను కించపరచడానికి KRK బహిరంగ వేదికను ఉపయోగించడం స‌రైన విధానం కాద‌ని ప‌లువురు తూర్పార‌బ‌డుతున్నారు. కేఆర్కే ఇక‌నైనా మారాల‌ని సామాజిక మాధ్య‌మాల్లో సూచిస్తున్నారు.


Tags:    

Similar News