ప్రేమ విఫలమైందంటూ కన్నడ నటుడు హుచ్చ వెంకట్ ఆత్మహత్యాయత్నం చేయటం తెలిసిందే. తాను ప్రేమించిన సినీ నటి రచనా పెళ్లికి నో చెప్పటంతో తాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా చెబుతున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేసి స్నేహితులకు.. మీడియాకు చెప్పటం.. ఆ వెంటనే స్పందించిన స్నేహితులు అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించటంతో అతడికి ముప్పు తప్పింది.
ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన వైనానికి చెంపలేసుకుంటున్నాడు వెంకట్. లవ్వర్ కోసం ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసి.. తల్లిదండ్రులకు ద్రోహం తలపెట్టానని వాపోతున్నాడు. ఓ షూటింగ్ సందర్భంగా సినీనటి రచన పరిచయం అయ్యిందని.. ఆ తర్వాత ప్రేమగా మారిందన్నాడు. తాను పాలిటిక్స్ లోకి వచ్చి కొత్త రాజకీయ పార్టీ స్టార్ట్ చేసిన రెండేళ్లకు పెళ్లి చేసుకుంటానని చెప్పానన్నారు. తర్వాత తాను పెళ్లి చేసుకోవాలని అడగటంతో.. తమ ఇంట్లోని వారు ఒప్పుకోవటం లేదని చెప్పిందన్నాడు.
దీంతో.. జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా చెప్పాడు. తాను చేసిన తప్పునకు చెంపలేసుకున్న వెంకటేశ్.. సమాజానికి తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/