''గౌతమీపుత్ర శాతకర్ణి''గా వస్తున్నాడు నందమూరి నటసింహం. ఇది ఆయన 100వ సినిమా అవ్వడంతో ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో అసలు ఎవ్వరూ ఊహించని విధంగా చాలా స్పెషల్ ఎఫెక్టులతో ఏదో మాయ చేయనున్నాడట మన దర్శకుడు క్రిష్.
ఈ మధ్యనే 8 కోట్ల వ్యయంతో మొరాకో దేశంలో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చింది బాలయ్య అండ్ టీమ్. అక్కడి ఔట్పుట్ చాలా బాగా రావడంతో మనోళ్ళు ఇక్కడ చేయబోయే రెండో షెడ్యూల్ మీద కూడా చాలా ఎక్సయిట్మెంట్ తో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ చిలుకూరు వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర వేసిన సెట్ ఏంటంటే.. అది ఒక ప్రాచీన కాలం నాటి యుద్ద నౌక. ఈ నౌకలో జరిగే వార్ సీన్ ఒకటి ఇప్పుడు షూట్ చేస్తున్నారు. వెనువెంటనే దాని తాలూకు గ్రాఫిక్స్ వర్కు కూడా మొదలెట్టేస్తారట. మొత్తానికి వింటుంటేనే మనోళ్లు ఏదన్నా ఒక 300 సీక్వెల్ స్థాయి ఫైట్లేమన్నా తీస్తారేమో అనేంత ఆశ కలుగుతుంది.
దర్శకుడు క్రిష్ ఈ 100వ సినిమాను చాలా ప్రత్యేకంగా తీసుకున్నట్లు అనిపిస్తోందిలే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర శ్రీయ చేస్తోందా లేదా అనే విషయం ఇంకా కన్ఫామ్ కాలేదు.