నటుడిగా అష్టాచమ్మా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా కమెడియన్ గా హీరోగా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంటూ దూసుకు పోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉన్నత చదువులు చదివిన నేను సినిమాల్లో ఆఫర్ల కోసం.. ఇండస్ట్రీలో కొనసాగడం కోసం చాలా కష్టపడ్డాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాని నేను పెద్దగా కష్టపడకుండానే ఈ స్థితికి వచ్చాను. కొందరు అనుకున్నట్లుగా నేనేమి ఇబ్బంది పడలేదు. ఇబ్బందులు లేకుండానే నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. తన సినీ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా ల్లో నేను ఇష్టంతో ప్రయత్నించాను కనుక నాకు కష్టం అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వారు చాలా మంది ఉంటారు. అయితే అవసరాల మాత్రం కష్టంను ఇష్టంగా చేసుకుని పైకి వచ్చినట్లుగా చెబుతున్నాడు.
ఇక ఆయన తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఆ ఆలోచన లేదు అని క్లారిటీగా చెప్పేశాడు. తనకు అసలు పెళ్లి గురించి ఆసక్తి లేదు. పెళ్లి పేరుతో స్వేచ్చను వదులుకోవడం ఎందుకు అంటూ వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. పెళ్లి చేసుకోక పోవడం అనేది కఠిన నిర్ణయం కాదని.. పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే కఠిన నిర్ణయం అంటూ చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో పెళ్లి చేసుకోవడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లి గురించి ఇలా చాలా మంది మాట్లాడారు. కాని చివరకు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీస్ తో హాయిగా ఉన్నారు. మరి అవసరాల కూడా తన నిర్ణయాన్ని మార్చకుంటాడేమో చూడాలి.