గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేజ్ కి చేరబోయే సమయంలో అమ్మడు వేసిన స్టెప్.. కెరీర్ ని స్లో చేసేసింది. ఇక్కడి జనాలు ఆఫర్లు ఇవ్వడంలో ఆలోచిస్తుంటే.. అక్కడ ఎక్కువ సినిమాలు దక్కించుకోలేకపోతోంది. ఇలాంటి సమయంలో ఇల్లీ బేబీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ ని విమర్శించడానికే అంటున్నారు కొంతమంది.
'నేను కష్టపడ్డాను కాబట్టే.. ఇవాళ బాలీవుడ్ లో ఈ స్టేజ్ లో ఉన్నా. ఇక్కడ ఓ అవకాశం వచ్చిందంటే అది నీ ట్యాలెంట్ కారణంగానే. అవకాశాన్ని ఉపయోగించుకుంటే నిలబడగలం, లేకపోతే కెరీర్ క్లోజ్ అంతే. నేను అవకాశాల కోసం ఎవరినీ అడుక్కోను. అది డిగ్నిటీకి సంబంధించిన విషయం' అంటోంది ఇల్లీ బేబీ. టాలీవుడ్ లో తిరిగి పాగా వేసేందుకు సూచనలు పంపడం.. మళ్లీ బాలీవుడ్ నుంచి పిలుపు వస్తే చెక్కేస్తుందనే భయంతో మనోళ్లు ఆఫర్లు ఇవ్వకపోవడం తెలిసిందే.
అయితే.. అమ్మడు కాసింత గట్టిగా ప్రయత్నిస్తే ఇక్కడ ఆఫర్స్ అందేవి కానీ.. అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. ఇప్పుడు నేను అడుక్కోను అంటూ టాలీవుడ్ మేకర్స్ కే.. ఈ భామ కౌంటర్ వేసినట్లుంది కదూ. నేను బాగా స్ట్రెయిట్ ఫార్వార్డ్ ఇలాగే మాట్లాడతా అంటూ కూడా సెలవిచ్చింది ఇలియానా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/