అసలు తాము నిన్న రాసింది ఏంటో క్లారిటీ ఇచ్చే పనిలో పడింది ''న్యూ ఇండియన్ ఎక్సప్రెస్'' పత్రిక. నిన్న కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్లు.. బ్రహ్మోత్సవం సినిమా గురించి చాలా నీచంగా కొందరు ఆన్ లైన్ లో ప్రమోట్ చేస్తున్న ఇమేజెస్ ను మీరెలా ప్రింట్ చేస్తారంటూ ఈ ప్రతిక ఆఫీసుకు వెళ్లి మరీ అడిగారు. తెల్లారి ఎడిషన్ లో వారికి ఆర్టికల్ పై క్లారిటీ ఇస్తాం అని చెప్పిన ఎక్సప్రెస్ ప్రతిక.. ''ఫ్యాన్స్ హర్టయ్యారు'' అంటూ రాసుకొచ్చింది.
కొంతమంది మహేష్ ఫ్యాన్స్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ లో కొందరు పనిలేని వారు.. ఏవేవో క్రియేట్ చేస్తూ చాలా నీచమైన ప్రాపగేషన్ కు పాల్పడతారని.. కాని ప్రింట్ మీడియా అనేది చాలా ఉత్తమమైనదని.. సో ప్రింట్ లో ఇలాంటివి ప్రచురించడం బాధ కలిగించిందని చెప్పినట్లు.. పత్రిక కథనంలో తెలిపింది. #WeLoveMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా బాగా ప్రమోట్ చేశారు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అసలు ఈ పత్రిక.. ఖండించలేదు.. సారీ చెప్పలేదు.. ఇది పెద్ద ట్విస్టే. అసలు వీరు ఆ ఆర్టికల్ ఎందుకు రాశారో అనే విషయం గురించి మాత్రం ఒక నాలుగు లైన్లు చెప్పారు.
''ఈ కాలమ్ లో ప్రచురించబడిన కథనం.. కేవలం ఈ మధ్య కాలంలో ఆడియన్స్ అండ్ జనరల్ పబ్లిక్ ఏదైనా సినిమా నచ్చకపోతే ఎలా రియాక్టు అవుతున్నారు తెలుపడానికే. వారు ఆన్ లైన్ లో తమ ఐడెంటెటీ తెలియజేయకుండా.. తమకు నచ్చని విషయాన్ని ఖండించడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు'' అంటూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది.