చిరు ఫ్యాన్స్ కి ఈ సారి మాస్ ట్రీట్ ఖాయ‌మేనా?

Update: 2022-10-15 08:55 GMT
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా 'గాడ్ ఫాద‌ర్ ' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ ద‌స‌రా బ‌రిలో నిలిచి మంచి హిట్ అనిపించుకుంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి త‌న 154వ ప్రాజెక్ట్ ని బాబి (ర‌వీంద్ర‌)తో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో చిరు మాస్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నారా? అంటే తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన  ఈ చిరు స్టిల్స్ అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి.

ఇటీవ‌ల 'గాడ్ ఫాద‌ర్‌' స‌క్సెస్ సంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చిరు ఈ మూవీలోని త‌న క్యారెక్ట‌ర్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. త‌న నుంచి ప్రేక్ష‌కులు, ఆభిమానులు కోరుకునే పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా ఈ సినిమాలో త‌న పాత్ర వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అదే విష‌యాన్ని తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన చిరు మాసీవ్ లుక్స్‌ రుజువు చేస్తూ ఈ సారి అభిమానుల‌కు చిరు మాస్ ట్రీట్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా? అని స్ప‌ష్టం చేశాయి.

గ‌ళ్ల లుంగీ.. హాఫ్ ష‌ర్ట్ ధ‌రించి.. త‌ల‌కు రెడ్ క‌ర్చీఫ్ తో ముఠా మేస్త్రీ, అంద‌రివాడు లుక్ ని త‌ల‌పిస్తూ చిరు చేస్తున్న హంగామా ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకుంటోంది. చాలా రోజుల త‌రువాత చిరు మాసీవ్ లుక్ లో క‌నిపిస్తుండ‌టంతో ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటూ 154 ప్రాజెక్ట్ పై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. గోదావ‌రి యాస తో ఫిష‌ర్ మెన్ గా మెగాస్టార్ ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నాడు. త‌న‌కు సోద‌రుడిగా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్  వైజాగ్ రంగ‌రాజు పాత్ర‌లో మాస్‌ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

త‌న‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌గా, ర‌వితేజ స‌ర‌స‌న కేథ‌రిన్ క‌నిపించ‌బోతోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి రెడీ అవుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్ ని ఈ దీపావ‌ళికి విడుద‌ల చేయ‌బోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ఫుల్ క్లారిటీని చిత్ర బృందం ఇవ్వ‌బోతోంది.

గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీకి 'వాల్తేరు వీర‌య్య‌' అనే టైటిల్ వినిపిస్తోంది. చిరు నుంచి ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర‌ఖ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ తాజాగా చిరు లుక్ కు సంబంధించిన ఫొటోలు లీక్ కావ‌డంతో ఈ మూవీతో మాస్ ట్రీట్ ఖాయం అని సంబ‌రాలు చేసుకుంటున్నార‌ట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News