'జాతిరత్నాలు' 2 రోజుల కలెక్షన్స్: హాస్యరత్నాలకే అగ్ర తాంబూలం..!

Update: 2021-03-13 08:30 GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలైన ''జాతితర్నాలు'' మంచి కలెక్షన్స్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం.. రెండో రోజూ హవా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 'జాతి రత్నాలు' సినిమా రెండో రోజు ఏకంగా 2.8 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటింది. అంటే మొత్తంగా 2 రోజుల్లో ఈ సినిమా 7.47 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో 'జాతిరత్నాలు' 2 రోజుల కలెక్షన్స్ వివరాలు గమనిస్తే.. నైజాం - 3.41కోట్లు.. సీడెడ్ - 92.5 లక్షలు.. నెల్లూరు - 18.8 లక్షలు.. కృష్ణ - 45.2 లక్షలు.. గుంటూరు - 62.3 లక్షలు.. వైజాగ్ - 96 లక్షలు.. ఈస్ట్ - 47.7 లక్షలు.. వెస్ట్ - 43.8 లక్షలుగా ఉన్నాయి. AP +TS లలో రెండు రోజుల్లో మొత్తం 7.47 కోట్ల షేర్ తో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియన్స్ ఈ హాస్యరత్నాలకే అగ్ర తాంబూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడో రోజు నుంచి కొన్ని షోలు పెంచడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. కాగా, అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన 'జాతిరత్నాలు' చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌ పై 'మహానటి' నాగ్ అశ్విన్ నిర్మించాడు.
Tags:    

Similar News