తమిళనాడు ప్రజల అమ్మ - దివంగత మాజీ సీఎం జయలలిత ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత చెరగని ముద్ర వేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు సినిమాలు - అటు రాజకీయాలలో తనదైన పాత్ర పోషించి ఎందరో మనసులలో జయలలిత చెరగని ముద్ర వేసుకున్నారు. తమిళనాడు ఐరన్ లేడీగా - అమ్మగా - పురుచ్చతలైవీగా తమిళ తంబీలతో పిలిపించుకున్న జయలలిత గత ఏడాది అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అమ్మ మరణంతో తమిళనాడు ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.
అయితే జయలలిత జీవితం ఎందరికో ఆదర్శం అని ఆమెపై సినిమా తీయాలని పలువురు దర్శక నిర్మాతలు భావించారు. కాని ఏ ఒక్కరు ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకరిద్దరు ముందుకు వచ్చినప్పటికీ అవి ముందుకు పడలేదు. తాజాగా ఆదిత్య భరద్వాజ్ - జయలలిత బయోపిక్ ని తెలుగు - తమిళం - హిందీ భాషలలో చేయబోతున్నట్టు ప్రకటించాడు. వై స్టార్ సీటీపీఎల్ బేనర్ పై ఈ చిత్రం రూపొందనుంది.థాయ్ పురుచ్చతలైవీ అనే టైటిల్ ని జయలలిత బయోపిక్ కి ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాంచ్ కానుంది.70 శాతం చిత్రీకరణ ముంబైలో తెరకెక్కించనున్నారు. నటిగా ఉన్నప్పుడు జయలలిత లైఫ్‌కి సంబంధించిన సన్నివేశాలని అక్కడ షూట్ చేయనున్నారు.
ఇక సినిమాల తర్వాత జయలలిత పొలిటికల్ జర్నీ ఎలా సాగింది, ఆమె మరణం వెనుక ఆసక్తికర విషయాలకి సంబంధించిన సన్నివేశాలను చెన్నైలో షూట్ చేయనున్నారు. ఇక త్వరలో కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన విషయాలు కూడా రివీల్ చేయనున్నారు. జయలలిత బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తి కాగా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం