ఫ్యాషన్స్ ని అనుసరించడానికి ఏజ్ తో పనేం ఉంది? ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తులు ట్రెండీగా నేటి తరానికి క్లిక్కయ్యేలా ఉండాలి అంతే. 50కి చేరువలో ఉన్నా కానీ ఈ తరహా ఫీట్స్ వేయడంలో మలైకా అరోరా.. మాధురి ధీక్షిత్ నీనే.. శిల్పా శెట్టి లాంటి వెటరన్ లు సత్తా చాటుతున్నారు.
ఇప్పుడు వీరందరికీ ఏమాత్రం తగ్గను అని నిరూపిస్తూ కాజల్ అల్ట్రా స్టైలిష్ డిజైనర్ లుక్ లో కనిపించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగన్ భార్యామణి కాజోల్ స్టైల్ కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడరనే పేరుంది. అందుకు తగ్గట్టే కాజోల్ పెద్ద తెల్లటి కాలర్ తో బ్లాక్ కలర్ థై-స్లిట్ దుస్తులలో ఆకర్షణీయంగా కనిపించారు. దుబాయ్ లో జరిగిన ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ కి హాజరైన కాజోల్.. టైట్ గా తన దేహానికి బిగించిన డ్రెస్ తో ఓవర్-ది-టాప్ కాలర్ లో అద్భుతంగా ఇమిడిపోవడం చర్చకు వచ్చింది.
ది గ్రేట్ కాజోల్ బోల్డ్ గా ఎంతో అందంగా కనిపించింది. స్ట్రాపీ హీల్స్- పర్సు స్టైల్ క్లచ్ తో ఫ్యాషన్ ని పరాకాష్టకు చేర్చిందనే చెప్పాలి. నల్లటి దుస్తులు మంచు మెరుపుల మేకప్ .. మెరిసే ఐషాడోతో ఆమె ఒంపుసొంపుల సోయగాలు ఆకర్షణీయంగా కనిపించాయి.
వర్క్ ఫ్రంట్ లో.. కాజోల్ ఇటీవలే రేవతి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. నాయికా ప్రధాన కథాంశంతో సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఇంతకుముందు సౌత్ లో ధనుష్ సినిమా వీఐపీ 2లో కాజోల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో ఆశించినంతగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో కొత్త దారిని అనుసరిస్తున్నారు.