గౌతమి పుత్ర శాతకర్ణితో విమర్శకుల మెప్పు కూడా పొందిన దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న మణికర్ణిక షూటింగ్ ప్రస్తుతం బికనీర్ లోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతోంది. ఇటీవలే జోద్ పూర్ - హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న మణికర్ణికలో టైటిల్ రోల్ కంగనా రౌనత్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఇందులో కత్తి యుద్ధంలో పాల్గొంటూ ముక్కుకు తీవ్ర గాయం చేసుకున్న కంగనా దాన్ని లెక్కచేయకుండా తిరిగి కంటిన్యూ చేయటం అప్పుడు బాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు బికనీర్ లో ఇంచుమించు అలాంటి రిస్క్ మరోసారి చేస్తోందట. ప్రస్తుతం బికనీర్ లో భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడు లేనంత దారుణంగా టెంపరేచర్ పడిపోతోంది. వెలుతురు రావడం కూడా మహా కష్టంగా ఉంది. అయినా కూడా షూటింగ్ ఆపే పరిస్థితి లేదు. కారణం సెటింగ్స్ తో పాటు కాల్ షీట్స్ అన్ని ముందుగా ప్లాన్ చేసి పెట్టుకోవడమే.
ఇప్పుడు అక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యవసరం అనుకుంటే మనిషి బయటికి వెళ్లి రావాల్సిందే. అయినా కూడా క్రిష్ టీం భయపడటం లేదు. దాదాపు 60 రోజుల పాటు జరిగిన వరస షెడ్యూల్స్ లో 30 రోజులు వెనుక చంటి బిడ్డను కట్టుకుని యుద్ధ సన్నివేశాల్లో పగలు రాత్రి తేడా లేకుండా పాల్గొనడం కంగనా ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపించింది. రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే నవ్వి ఊరుకుంటున్న కంగనా సమ్మర్ లో విడుదల చేసేందుకు వెనుకాడే సమస్యే లేదు అంటోంది.
చాలా ప్రతిష్టాత్మకంగా క్రిష్ రూపొందీస్తున్న ఈ మూవీకి కథను బాహుబలి ఫేం - రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. తెలుగు - తమిళ్ లో మాత్రం ఇది డబ్బింగ్ వెర్షన్ రూపంలో రానుంది. ఝాన్సీ లక్ష్మి బాయ్ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని శాతకర్ణి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా రూపొందిస్తున్నాను అని గర్వంగా చెబుతున్నాడు క్రిష్. పద్మావత్ ను తలదన్నే రీతిలో ఉంటూ తెలుగువాడి సత్తా మరోసారి బాలీవుడ్ కు రుచి చూపించేలా ఉండాలని సగటు తెలుగు ప్రేక్షకుడు కోరుకోవడంలో తప్పేముంది.