కంగన ఆ స్థాయిలో టార్చర్ పెట్టిందా?

Update: 2016-05-04 07:30 GMT
కొందరేమో సుమన్ అధ్యయన్ పబ్లిసిటీ కోసమే కంగనా రనౌత్ మీద ఆరోపణలు చేస్తున్నాడంటారు.. ఇంకొందరేమో ఇదంతా హృతిక్ వెనుక ఉండి ఆడిస్తున్న డ్రామా అంటారు.. మరికొందరేమో నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు.. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ కంగనా మీద వస్తున్న ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవి. కంగనా మాజీ ప్రియుడు సుమన్ అధ్యయన్ నాలుగు రోజుల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేతబడి చేస్తుందని.. ఇంకా ఏవేవో వెర్రి వేషాలు వేస్తుందని చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇప్పుడు అధ్యయన్ తండ్రి.. ప్రముఖ టీవీ ప్రెజెంటర్ శేఖర్ సుమన్.. అతడి భార్య కలిసి ఓ టీవీ షోలో మరింత తీవ్ర స్థాయిలో కంగనా మీద ఆరోపణలు చేశారు. వాళ్లేమంటున్నారంటే..

‘‘ఓ రోజు సుమన్ బెడ్ రూం డ్రా తెరిచి చూస్తే అందులో కొన్ని విచిత్రమైన వస్తువులు కనిపించాయి. మా ఇంటి పండితుణ్ని అడిగితే సుమన్ కు ఎవరో వశీకరణ మంత్రం వేశారని చెప్పారు. కంగనాతో పరిచయమైన కొన్నాళ్లకు మా అబ్బాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. డిప్రెషన్లో ఉన్నట్లు కనిపించాడు. ఓ రోజు ఉన్నట్లుండి గుండు కొట్టుకుని ఇంటికొచ్చాడు. ఏంటిది అని అడిగితే.. అది ఫ్యాషన్ అని చెప్పాడు. నిజానికి కంగనా బలవంతం మీద అతను గుండు చేయించుకోవాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది.

ఓసారి అర్ధరాత్రి దాటాక 2-3 గంటల సమయంలో అధ్యయన్ ఏడుస్తూ ఫోన్ చేశాడు. కంగనా తనను ఇంటి లోపలికి రాకుండా బయటే పెట్టి తాళం వేసిందన్నాడు. కంగనాకు ఫోన్ చేస్తే.. రాత్రంతా అతను బయటే ఉండాల్సిందే అని చెప్పింది. తర్వాత హృతిక్ బర్త్ డే పార్టీలో మా అబ్బాయి మీద చెప్పు విసరడమే కాక.. బూతులు తిట్టింది. హృతిక్ కు పంపించిన వల్గర్ మెసేజ్ ల గురించి అడిగితే.. ఇవన్నీ చాలా కామన్ అని చెప్పింది. ఓసారి ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమంలో అధ్యయన్ ను బాడీ గార్డులాగా వాడుకుంది. స్టేజ్ మీదికెక్కి అందరికీ థ్యాంక్స్ చెప్పి అధ్యయన్ పేరు మాత్రం చెప్పలేదు. ఇలా మావాడిని కంగన పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు’’ అని శేఖర్, అతడి భార్య ఆరోపించారు.
Tags:    

Similar News