బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. లండన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా సోకడంతో యూపీలోని లక్నో సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స చేస్తున్నారు. వరుసగా 4 సార్లు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. తాజాగా ఐదోసారి టెస్ట్ లో కరోనా నెగెటివ్ వచ్చింది. రెండు రోజులు పాటు పరీక్షించిన వైద్యులు తాజాగా ఆరోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని తేల్చి ఆమెను సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే కనికా దేశంలో దిగాక చాలా మంది రాజకీయ - సినీ ప్రముఖులను కలిసింది. పలు విందులు - కార్యక్రమాల్లో పాల్గొంది. కనికాకు కరోనా లక్షణాలున్నా పెడచెవిన పెట్టి ఇలా క్వారంటైన్ లో ఉండకుండా తిరిగినందుకు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బందితో కూడా కనిక గొడవపడింది. ఎట్టకేలకు సహకరించి కోలుకుంది. అయితే కనికా కోలుకున్నా కానీ ఇప్పటికిప్పుడు కుటుంబ సభ్యులతో కలిసే వీలు లేదు. ఆమె మరికొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో ప్రత్యేక గదిలో ఉండాలని డాక్టర్స్ సూచించారట..
రెండు వారాలుగా ఆస్పత్రి లో ఉంటున్న కనిక తీవ్ర డిప్రెషన్ లో ఉంది. ఇప్పుడు ఇంటికి చేరుతున్నా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక ఈమె అంటించిన వారు ఆందోళనగా ఉన్నారు. కనికా కోలుకున్నా.. ఈమె ద్వారా సంక్రమించిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఎంతమంది సీరియస్ గా ఉన్నారు? ఎంత మంది కోలుకున్నారన్నది మిస్టరీగా మారింది. మొత్తానికి కరోనా వాహకంగా మారిన కనిక కోలుకోవడం ఊరటనిచ్చింది. మిగతవారి పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది.