పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు ఫుల్ రన్ పూర్తయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలిపి పదుల సంఖ్యలో కూడా సినిమా ఎక్కడా ఆడ్డం లేదు. ఇకపై పెద్దగా వసూళ్లేవీ వచ్చే ఛాన్స్ లేదు. కాటమరాయుడు ఫైనల్ రన్ షేర్ కౌంటింగ్ చేసేసుకోవచ్చు.
ఇప్పటివరకూ మొత్తంగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రూపంలో రూ. 62.15 కోట్ల వసూళ్లను సాధించాడు కాటమరాయుడు. ఇది చాలా పెద్ద మొత్తమే.. చాలా మంది హీరోలు బ్లాక్ బస్టర్లతో కూడా అందుకోలేనంత భారీ మొత్తం. అయినా సరే కాటమరాయుడును ఫ్లాప్ కేటగిరిలోకి చేర్చాల్సిందే. ఎందుకంటే.. ఈ చిత్రాన్ని 72.5 కోట్లకు విక్రయించారు. ఖర్చులతో కలుపుకుంటే కనీసం 80 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది.
నైజాం 15.40 కోట్లు.. సీడెడ్ 8.26 కోట్లు.. ఉత్తరాంధ్ర 6.26 కోట్లు.. గుంటూరు 4.97 కోట్లు.. ఈస్ట్ 5.35 కోట్లు.. వెస్ట్ 4.22 కోట్లు.. కృష్ణా 3.69 కోట్లు.. నెల్లూరు 2.10 కోట్లు వసూలు కాగా.. మొత్తం ఏపీ-తెలంగాణల్లో 50.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కర్నాటక.. తమిళనాడు.. రెస్టాఫ్ ఇండియాలో 6.55 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఓవర్సీస్ వసూళ్లు 5.35 కోట్లు కాగా.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 62.15 కోట్ల కలెక్షన్స్ ను కాటమరాయుడు రాబట్టాడు.
పవన్ గత మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ 52.4 కోట్ల షేర్ తో సరిపెట్టుకున్నాడు. దీంతో ఆ సినిమాను డిజాస్టర్ కేటగిరీలోకి చేర్చారు. ఇప్పుడు సర్దార్ విషయానికి వస్తే.. థియేట్రికల్ రైట్స్ సర్దార్ రేంజ్ లోనే అమ్మినా.. వసూళ్లు మరో 10 కోట్లు ఎక్కువ కావడంతో.. ఇది ఫ్లాప్ కేటగిరీలోకి చేరింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/