క‌త్రిన - విక్కీ ల‌వ్ క‌పుల్ ఆధారాలు ఒక్కొక్క‌టిగా..!

Update: 2021-08-20 04:39 GMT
అందాల క‌థానాయిక క‌త్రిన కైఫ్ యువ‌హీరో విక్కీ కౌశ‌ల్ తో స‌హ‌జీవ‌నం చేస్తోందంటూ చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. ఆ ఇద్ద‌రి ప్రేమాయ‌ణం గురించి పుకార్లు మాత్ర‌మే కాదు జంట ష‌కార్ల‌కు ఆధారాలు ఉన్నాయి. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అయితే విక్కీ - క‌త్రిన జంట మాత్రం దీనిని అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు.

గ‌త కొద్దిరోజులుగా ఈ జంటకు నిశ్చితార్థ‌మైంద‌ని క‌త్రిన నిశ్చితార్థ ఉంగ‌రం ధ‌రించి క‌నిపిస్తోంద‌న్న‌ పుకార్లు మ‌రింత‌గా వేడి పెంచాయి. అంతేకాదు వారి రోక వేడుక గురించి పుకార్లు బుధవారం నాడు అంత‌కంత‌కు అట్టుడికించాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమే వాటిలో నిజం లేదు. కత్రినా కైఫ్ అధికార ప్రతినిధి జూమ్ టీవీతో మాట్లాడుతూ.. ఎవ‌రికీ తెలియ‌కుండా రోకా వేడుక జరగలేదని... సల్మాన్ ఖాన్ `టైగర్-3` షూటింగ్ కోసం క‌త్రిన ప్రిపేర‌వుతోంద‌ని వెల్ల‌డించారు. టైగ‌ర్ 3 త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.

``రోకా వేడుక జరగలేదు. ఆమె త్వరలో టైగర్ 3 షూట్ కోసం బయలుదేరుతుంది`` అని జూమ్ టీవీ వెల్ల‌డించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో హర్ష్ వర్ధన్ కపూర్ జూమ్ చాట్ షో బై ఇన్వైట్ ఓన్లీలో కనిపించాడు. అతను కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించారు. విక్కీ - కత్రినా కలిసి ఉన్నారు.. అది నిజం. ఇది చెప్పినందుకు నేను ఇబ్బందుల్లో పడతానేమో? నాకు తెలియదు. వారు దాని గురించి చాలా ఓపెన్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను`` అని అతను చెప్పాడు.

ఇటీవ‌ల ల‌వ్ క‌పుల్ `షేర్ షా` స్క్రీనింగ్ కు క‌లిసే వచ్చారు. జంట‌గా సినిమా చూశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తన బాయ్‌ఫ్రెండ్ కం నటుడు విక్కీ కౌశల్ కి క‌రోనా వైరస్ పాజిటివ్ వ‌చ్చాక మ‌రుస‌టి రోజే క‌త్రిన‌ తన కోవిడ్-19 నిర్ధారణ ప‌రీక్ష గురించి వెల్ల‌డించింది. విక్కీ-క‌త్రిన ఇద్ద‌రికీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చాక ఒకేసారి గృహ‌నిర్భంధంలోకి వెళ్లారు.

విక్కీ కౌశల్ -కత్రినా కైఫ్ ప‌లుమార్లు మీడియా కంటికి జంట‌గా దొరికిపోయారు. 2019లోనే ముంబైలో డిన్నర్ డేట్ లో కనిపించిన తర్వాత చాలా కాలం ట్రెండ్ అయ్యారు. డేటింగ్ కి సంబంధించిన‌ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

2018 లో కరణ్ జోహార్ టాక్ షో `కాఫీ విత్ కరణ్` 6వ‌ ఎపిసోడ్ లో కత్రినా కైఫ్ మాట్లాడుతూ - ``తెరపై విక్కీ కౌశల్ తో బాగా కనిపిస్తానని`` చెప్పింది. షో సమయంలో కత్రినా స్టేట్ మెంట్ గురించి చెప్పినప్పుడు విక్కీ కౌశల్ మూర్ఛపోయినట్లు ఎక్స్ ప్రెష‌న్ ఇవ్వ‌డం ఫ‌న్ క్రియేట్ చేసింది. ఈ జోడీ మ‌ధ్య కెమిస్ట్రీపై క‌ర‌ణ్ చాలా చాలా గుస‌గుస‌లాడారు. తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి నిశ్చితార్థం నిజ‌మా కాదా? అన్న‌ది ఇప్పుడే నిర్థార‌ణ‌కు రాలేం. క‌త్రిన‌ను విక్కీ సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే పెళ్లాడేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని భావించాల్సి ఉంటుందేమో!!?

టైగ‌ర్ 3 లో క‌త్రిన డేర్ డెవిల్ యాక్ష‌న్

టైగ‌ర్ సిరీస్ లో రెండు సినిమాలు రిలీజై సంచ‌ల‌న విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమా స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది. ఈసారి పార్ట్-3కి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వార్ రైట‌ర్ శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ తో క‌లిసి ఆదిత్య చోప్రా స్క్రిప్టును అందిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. మ‌నీష్ శ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైగ‌ర్ 3 గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో యాక్షన్ ప్యాక్డ్ సినిమా. మొదటి షెడ్యూల్ ని సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ జంట‌పై ప్రారంభించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హ‌స్మి విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్నారు. టైగర్ 3 లో ఐఎస్ఐ ఏజెంట్ పాత్రను ఇమ్రాన్ హ‌ష్మి పోషిస్తారు. ఇండియన్ టైగర్ అవినాష్ సింగ్ రాథోడ్ కు పాకిస్తాన్ నుంచి అత‌డు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థిగా తెర‌పై క‌నిపిస్తారు. ఇందులో జోయాగా క‌త్రిన పాత్ర కూడా యాక్ష‌న్ ప్యాక్డ్ స్టంట్స్ తో అల‌రిస్తుంది. టైగ‌ర్ జిందా హైలో క‌త్రిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ లో అద్భుతంగా న‌టించింది. ఇప్పుడు అంత‌కుమించి అన్న చందంగా త‌న‌ని ఎలివేట్ చేయ‌నున్నారని తెలిసింది.




Tags:    

Similar News