కొన్నిటికి గట్స్ ఉండాలి. ప్రతిదానికి కమిట్ మెంట్ ఉండాలి. అప్పుడే కొన్ని సాధ్యం. ముఖ్యంగా జిమ్మింగ్ తో ఫిట్ గా ఉండడం అన్నది కొందరికే చెల్లింది. ఇక ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం వెనకాడని నైజం కత్రిన సొంతం. ఇదిగో ఇక్కడ క్యాట్ కష్టం చూశారా? ఆన్ లొకేషన్ కారవ్యాప్ పక్కనే రోడ్ లో అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి ఎలా శ్రమిస్తోందో? ఇల్లు.. జిమ్ .. వర్క్ ప్లేస్.. ఎక్కడైనా నేను రెడీ అంటోంది. ప్రఖ్యాత ఫిట్ నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా కత్రినకు వ్యక్తిగత శిక్షకుడు. ఆయన సమక్షంలోనే ఈ కష్టం.. శ్రమ.
కత్రిన చివరి సారిగా సల్మాన్ ఖాన్ సరసన భారత్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత సల్మాన్ కి కాస్త దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం వరుసగా వేరే బ్యానర్ల సినిమాలకు సంతకాలు చేసింది. సూర్య వన్షీ.. అంగ్రేజీ మీడియం వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు.. కత్రిన గత కొంతకాలంగా `యూరి` ఫేం విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇంతకుముందు అతడితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న క్రమంలో ఈ పుకార్ మొదలైంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆ ఇద్దరూ ఒంటరిగా జంట షికార్లు చేయడం వేడెక్కించింది.
ఇదంతా ఒకెత్తు అయితే.. ఇదిగో ఇలా జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ కత్రిన హాట్ టాపిక్ గా మారుతోంది. తనదైన నటనా ప్రతిభ ఫిట్నెస్ పాలనతో కత్రిన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. సినీ పరిశ్రమలో భాగమైనప్పటి నుండి ఫిజికల్ గా తన అందాన్ని శరీరాన్ని కాపాడుకోగలిగింది. తాజాగా రిలీజ్ చేసినది ఓ త్రోబాక్ వీడియో. ఇందులో కత్రినా కైఫ్ అప్రయత్నంగా హ్యాండ్ పుష్-అప్ చేయలేదని అర్థమవుతోంది.