అందాల రాశుల్ని అందంగానే చూడాలనుకుంటాం. వాళ్లకు ముసలి వేషాలు వేస్తే భరించడం చాలా కష్టం. దశాబ్దం పాటు తన సోయగాలతో సౌత్ ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపిన సిమ్రాన్ కు ‘ఒక్క మగాడు’లో వేసిన మేకప్ చూసి జనాలకు డోకొచ్చింది. ముసలి వేషంలో చూపించడానికి మరీ అలా తయారు చేయాలా అని వైవీఎస్ చౌదరిని తిట్టుకున్నారు సిమ్రాన్ ఫ్యాన్స్. అప్పుడు సిమ్రాన్ కు వేసిన మేకప్ ను ప్రోస్థెటిక్ మేకప్ అంటారు. హిందీలో ‘పా’ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ కు వేసింది కూడా ఈ మేకప్పే. హాలీవుడ్ లో ఈ మేకప్ బాగా ఫేమస్. ఈ మధ్యే ఇండియాలో కూడా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఫర్హాన్ నిర్మాణంలో తెరకెక్కే ఓ బాలీవుడ్ సినిమాలో మరోసారి ఈ మేకప్ ను ఉపయోగించబోతున్నారు.
ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. నిత్య మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో హీరో హీరోయిన్లు 28, 46, 60 ఏళ్ల వయసుల్లో కనిపించాల్సి ఉంటుందట. అలా వేర్వేరు వయసులకు తగినట్లు చూపించడం కోసం సిద్దార్థ్, కత్రినాలకు ప్రొస్థెటిక్ మేకప్ వేయబోతున్నారట. ఐతే కత్రినా ఇప్పటిదాకా అన్నీ గ్లామర్ రోల్సే చేసింది. ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లో ఆమె ఒకరు. అలాంటి గ్లామర్ డాల్ ను ప్రొస్థెటిక్ మేకప్ లో ముసలిదానిలాగా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా అని డౌటు. ఏదో జుట్టకు కొంచెం తెల్ల రంగేసి.. ముతక చీర కట్టించేస్తే ఓకే కానీ.. కత్రినా ఇంకో ముప్ఫై ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో చూపించేస్తే కుర్ర గుండెలు కళుక్కుమనడం ఖాయం.