కీర్తి సురేష్... నటిమేనక కూతురే అయినా ఈమెకు నటించడం రాదు. హావ భావాలు అసలే పలకడం లేదు. బొద్దుగా వుంటుంది... హీరోయిన్ మెటీరియలే కాదు!! అంటూ కెరీర్ తొలి నాళ్లలో విమర్శలు వినిపించాయి. `అజ్ఞాతవాసి` సమయంలోనూ ఆ చిత్రంలో కీర్తిసురేష్ పై ఘాటు విమర్శలే వినిపించాయి. అసలు ఏ ఫ్రేమ్ లోనూ కీర్తి నటించినట్టుగా కనిపించలేదు. ఫ్రేమ్ లో వుందా అంటే ఉంది అన్నట్టుగా ప్రవర్తించిందని విమర్శలొచ్చాయి. ఒక సెక్షన్ కి కీర్తి నటన నచ్చుతున్నా ఇంకో సెక్షన్ విమర్శించడం అప్పట్లో చర్చకు వచ్చింది.
ఇక `మహనటి` సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ని కన్ఫర్మ్ చేసుకున్నారని తెలియగానే మహానటి సావిత్రి ఎక్కడ? కీర్తిసురేష్ ఎక్కడ? అంటూ భారీ స్థాయిలో విమర్శలు గుప్పుమన్నాయి. అయినా లెక్కచేయకుండా తనేంటో మాటలతో కాకుండా చేతలతో నిరూపించేందుకు మౌనాన్నే ఆశ్రయించింది కానీ కీర్తి ఎక్కడా బరస్ట్ కాలేదు. చివరికి తనేంటో.. తన నటనాభినివేశం ఏ స్థాయిలో ఉంటుందో చూపించింది. సావిత్రి పాత్రలోకి పరకాయప్రవేశం చేసిందా? అన్నంతగా నటించి మహానటిని కళ్లకు సాక్షాత్కరింపజేసి ఔరా అనిపించింది. అలాంటి కీర్తి సురేష్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి సరిగ్గా 6 ఏళ్లవుతోంది.
మలయాళ చిత్రం `గీతాంజలి`తో కథానాయికగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన ఆ హారర్ థ్రిల్లర్ చిత్రం తరువాత కీర్తి కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తరువాత టాలీవుడ్ లో కొన్ని ఎత్తు పల్లాలు చవిచూసినా `మహానటి` చిత్రం ఆమె కెరీర్ కు రెడ్ కార్పెట్ పరిచి రాచబాటను వేసింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అరడజను ఆఫర్లు అందుకుంది. పెంగ్విన్- మిస్ ఇండియా- నితిన్‌తో రంగ్‌దే, గుడ్ లక్ సఖి- మణిరత్నం `పొన్నియన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తోంది.
``నేను నటిగా ఆరేళ్ల క్రితం పుట్టాను. గొప్ప గొప్ప వకాశాల్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నా కుటుంబం సభ్యులు.. నన్ను ఆదరించే వారు.. శ్రేయోభిలాషులు నాకు సపోర్ట్ గా నిలిచారు. ఇలాగే మీరు.. నేను చాలా దూరం వెళ్లాలి. నాతో కలిసి ప్రయాణించడం కోసం ఓ పాప్ కార్న్.. ఓ సీటుని రిజర్వ్ చేసుకోండి` అంటూ సోషల్ మీడియాలో కీర్తి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పాప్ కార్న్.. రిజర్వుడు సీటు! అంటూ కీర్తి చాలానే చమత్కరించింది. ఎంతయినా మహానటి కదా!!