ముద్దు స‌న్నివేశాలకు ఇబ్బంది ప‌డ‌లేద‌న్న భామ‌!

Update: 2019-06-18 06:15 GMT
టాలీవుడ్ ను అల‌రిస్తోన్న కొత్తందం కియారా అడ్వాణీ. భ‌ర‌త్ అనే నేనుతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ విన‌య విధేయ రామ త‌ర్వాత ఆమెకు సినిమాలు రాకున్నా.. అర్జున్ రెడ్డి రీమేక్ ఆఫ‌ర్ ను సొంతం చేసుకొని బాలీవుడ్ లో భారీ ఎంట్రీ కోసం అతృత‌గా ఎదురుచూస్తోంది.

త్వ‌ర‌లో విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ఫ‌లితం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర‌ను మాతృక‌లో చేసిన షాలినీ పాండేను తాను క‌ల‌వ‌లేద‌ని పేర్కొంది. మ‌రి.. సినిమాలో బోలెడ‌న్ని ముద్దుసీన్లు ఉంటాయి క‌దా?  ఇబ్బంది ప‌డ‌లేదా? అంటే.. ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన్ని ఇచ్చింది.

క‌బీర్ సింగ్ మోడ్ర‌న్ లవ్ స్టోరీగా పేర్కొన్న కియారా.. నేటి ప్రేమ‌ల్లో ముద్దులు.. కౌగిలింత‌లు స‌హ‌జ‌మ‌ని పేర్కొంది. తాజా సినిమాలో అవన్నీ స‌హ‌జంగా.. అందంగా ఉంటాయ‌ని.. అందుకే త‌న‌కు ఎక్క‌డా ఇబ్బంది అనిపించ‌లేద‌ని పేర్కొంది. ముద్దు సీన్ల‌కు ఇబ్బంది లేదంటూనే.. అందుకు తగ్గట్లు భ‌లే రీజ‌న్ చెప్పింది. చూస్తుంటే కియార‌కు అందమే కాదు..  ట‌న్నుల కొద్ది తెలివితేట‌లు ఉన్న‌ట్లున్నాయే?

    

Tags:    

Similar News