ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే. ఐకానిక్ ఫిబ్రవరి 13 తేదీ వాలెంటైన్స్ వీక్ లో కిస్ డేగా గుర్తింపును దక్కించుకుంది. బాలీవుడ్ సినిమాల్లో తెరపై సుదీర్ఘ చుంబనాలతో వేడెక్కించిన టాప్ కిసెస్ ఏవి? అన్నది ఆరా తీస్తే ఇదీ సంగతి.
వాలెంటైన్స్ వీక్ సంరద్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటలు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తున్నారు. సాధ్యమైనంత ప్రత్యేక పద్ధతిలో ప్రేమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. రోజ్ డే.. చాక్లెట్ డే.. టెడ్డీ డే.. లు ఉన్నట్టే ఈ రోజును కిస్ డేగా గుర్తిస్తే... పెదవి ముద్దుల దినోత్సవం కూడా పాపులరవుతుంది.
సినిమా చరిత్ర పరిశీలిస్తే.. పలువురు అగ్ర హీరోలు తమ సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలతో వేడెక్కించిన సందర్భాలు ఉన్నాయి. ప్రేక్షకులను ఉద్రేకానికి గురి చేసిన అలాంటి ముద్దుల్లో...రాజా హిందుస్తానీలో అమీర్ ఖాన్- కరిష్మా కపూర్ సుదీర్ఘ చుంబనంతో థియేటర్లలో విజిల్స్ వేయించారు. ఆ ముద్దు సీన్ అప్పట్లో యూత్ లో హాట్ టాపిక్. ఒక నిమిషం నిడివి స్టీమి కిస్ అది. ఆ ముద్దు సన్నివేశాన్ని రూపొందించడానికి అక్షరాలా ఇరవై ఒకటి రీటేక్ లు తీసుకున్నారు.
మర్డర్ లో ఇమ్రాన్ హష్మి- మల్లికా షెరావత్ కిస్ అంతే ఆవిరులు పుట్టించింది. పెళ్లయిన యువతిని వెంటాడి ముద్దాడే ముద్దుల హీరోగా ఇమ్రాన్ హస్మి సంచలనాలకు తెర తీసాడు. ఆ తర్వాత ఇమ్రాన్ ను ‘సీరియల్ కిస్సర్` అని పిలిచారంటే సీన్ అర్థం చేసుకోవాలి.
జబ్ వియ్ మెట్ లో కరీనా కపూర్ ఖాన్- షాహిద్ కపూర్ ఈ తరహా కిస్ తో అదరగొట్టారు.ఆ జంట కెమిస్ట్రీని ప్రేక్షకులు అప్పట్లో ఎంతో ఇష్టపడ్డారు. షాహిద్ - కరీనా `జబ్ వి మెట్ `లో ఒక సన్నివేశంలో ఉద్వేగభరితమైన ముద్దుతో ఆవిరులు పుట్టించారు.
ధూమ్ 2 లో ఐశ్వర్య రాయ్ బచ్చన్- హృతిక్ రోషన్ రోమాంచితమైన పెదవి ముద్దు అప్పట్లో సెన్సేషన్. భారీ యాక్షన్ డ్రామా లో ప్రేక్షకులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే కిస్ సీన్ అది. ఆ జంట ఘాటైన ఫ్రెంచ్ కిస్ చాలా సంచలనం సృష్టించింది.ఐష్ హబ్బీ అభిషేక్ అయితే చిన్నబుచ్చుకున్నాడని.. కుళ్లుకున్నాడని ప్రచారమైంది.
గోలియోన్ కి రాసలీలా `రామ్ లీలా`లో దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ జంట అలానే రొమాంటిక్ కిస్ తో అలరించారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన నిజ జీవిత డ్రామాలో ఆ జంట కెమిస్ట్రీకి విజిల్స్ వేశారు జనం. సినిమాలోని ఒక సన్నివేశంలో ఇద్దరూ ఘాటైన ముద్దుతో చెలరేగారు. ఇక కమల్ హాసన్.. అమీర్ ఖాన్.. ఇమ్రాన్ హస్మి లకు ముద్దుల హీరోలుగా గొప్ప ఇమేజ్ ఉంది జనంలో.