తమిళ హీరోలు వచ్చి మన మార్కెట్ ను కొల్లగొట్టేయడం మన హీరోలకు లోలోన అసూయగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే చాలా ఏళ్లుగా మన హీరోలిలా ఫీలవ్వడం తప్పితే.. వేరే ఇండస్ట్రీల్లో మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు మాత్రం పెద్దగా చేయలేదు. ఒక్క అల్లు అర్జున్ మల్లూవుడ్ లో నెమ్మదిగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు తప్పితే.. మిగతా హీరోల ప్రయత్నం శూన్యం. ఐతే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సీన్ రివర్స్ అవుతోంది. పొరుగు రాష్ట్రాల మార్కెట్ పై మన హీరోల కళ్లు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బాహుబలే అని చెప్పాలి.
సరిగా మార్కెట్ చేస్తే.. సినిమాలో కంటెంట్ ఉంటే మన సినిమా ఎక్కడైనా ఆడుతుందని బాహుబలి రుజువు చేసింది. ముఖ్యంగా తమిళ నాట ఈ సినిమా ఇరగాడేసింది. బాహుబలి తెచ్చిన ఊపుతో ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ని కూడా ఒకేసారి విడుదల చేస్తున్నారు. మహేష్ తన తర్వాతి సినిమా ‘బ్రహ్మాత్సవం’ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కేలా చూసుకుంటున్నాడు. ఇకపై మహేష్ తన ప్రతి సినిమానూ తమిళంలో రిలీజ్ చేయాలని.. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవాలని చూస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ప్రతి సినిమా కూడా తమిళంలో విడుదలవుతుందనడంలోనూ సందేహం లేదు. మరోవైపు ప్రభాస్ కూడా తమిళ మార్కెట్ పై కన్నేస్తాడనడంలో సందేహం లేదు. మిగతా హీరోలు కూడా ఈ ట్రెండును అందిపుచ్చుకోవడం ఖాయమే.
ఐతే మన హీరోల మార్కెట్ తమిళంలో పెరుగుతున్న సమయంలోనే తమిళ హీరోల మార్కెట్ మనదగ్గర పడిపోతుండటం గమనార్హం. తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్.. ‘లింగ’తో తన మార్కెట్ ను బాగా దెబ్బ తీసుకున్నాడు. ఆ ప్రభావం రజినీ తర్వాతి సినిమాపై కచ్చితంగా ఉంటుంది. కమల్ హాసన్ మార్కెట్ ఎంత దెబ్బ తిందో ‘ఉత్తమ విలన్’ రుజువు చేసింది. మరోవైపు గత కొన్నేళ్లలో తెలుగులో ఫాలోయింగ్ బాగా పెంచుకుని ఓ దశలో రూ.15 కోట్ల మార్కును అందుకున్న సూర్య ఇప్పుడు పది కోట్ల లోపుకు పడిపోయాడు. కార్తి అసలీ మధ్య తెలుగులో సినిమానే విడుదల చేయట్లేదు. విశాల్, అజిత్ ల సంగతీ అంతంతమాత్రంగానే ఉంది. మొత్తానికి తమిళంలో మనోళ్ల మార్కెట్ పెరగడం, ఇక్కడ వాళ్ల మార్కెట్ పడటం ఒకేసారి జరుగుతుండటం విశేషమే.