ప్రభాస్ కి బాహుబలి ముందు - బాహుబలి తర్వాత అన్న చందంగా.. దేవరకొండకు `గీత గోవిందం` ముందు.. గీత గోవిందం తర్వాత అన్నట్టే ఉంది సీను. ఒకే ఒక్క 100 కోట్ల క్లబ్ సినిమా దేవరకొండ ఇమేజ్ ని స్కై లోకి లేపేసింది. ఇప్పుడు ఎవరూ పెళ్లి చూపులు బోయ్ అనో - నాలుగు సినిమాల కిడ్ అనో అనడం లేదు. నైజాం మెగాస్టార్ అని పిలిచేందుకు అసలే మొహమాట పడడం లేదు. హైదరాబాద్ - కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో `నోటా` పబ్లిక్ మీట్ సాక్షిగా.. దేవరకొండను ఆకాశానికెత్తేస్తున్నారు ఒక్కో సెలబ్రిటీ.
అంతేకాదు.. స్టార్ డైరెక్టర్ల కన్ను ప్రస్తుతం దేవరకొండపైనే ఉందని తాజా సన్నివేశం చెబుతోంది. నోటా వేడుకలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ- విజయ్ పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి - గీత గోవిందం - ఇప్పుడు నోటా ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్ తో విజయ్ దగరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్ తో వస్తాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు. అంటే దేవరకొండ కోసం వేచి చూసే స్టార్ డైరెక్టర్లు ఉన్నారనడానికి ఇంతకంటే ఏం కావాలి. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అపజయం అన్నదే ఎరుగని స్టార్ డైరెక్టర్ గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న కొరటాల శివ పబ్లిక్ వేడుకలో ఇలా ప్రామిస్ చేశారంటే నిలబెట్టుకోకుండా ఉంటారా?
పైగా దేవరకొండ కోసం స్పెషల్ స్క్రిప్టు తెస్తానని మాటిచ్చేశారు. ఇకపోతే ఇదే వేదికపై వంశీ పైడిపల్లి - నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్లు దేవరకొండ ప్రతిభా పాఠవాల్ని - రైజింగ్ స్టైల్ ని కొనియాడారు. వీళ్లంతా ఇక దేవరకొండ క్యూలో వెయిటింగ్ అనే భావించాల్సి ఉంటుంది. మొత్తానికి ఇంతింతై అన్న చందంగా దేవరకొండ తనని తాను మలుచుకుంటున్న తీరు - అసలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగేస్తున్న తీరు ఎందరికో స్ఫూర్తి నింపుతోంది. నోటా ఈనెల 5న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.