క్రిష్ మామూలుగా చేయ‌డం లేద‌ట‌

Update: 2017-07-27 11:30 GMT
యువ ద‌ర్శ‌కుడు క్రిష్ `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` సినిమాని తీసిన విధానం ప్రేక్ష‌కుల్నే కాదు, ఇండ‌స్ట్రీని కూడా అబ్బుర‌ప‌రించింది. ఆ బ‌డ్జెట్‌లో ఆ రేంజ్ సినిమా తీశాడా? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌క‌రంగా మాట్లాడుకొన్నాడు. ఆ సినిమాతో క్రిష్ స‌త్తా ఏమిటో మ‌రోసారి బ‌య‌ట‌పడిన‌ట్టైంది. ఆయ‌న ప్ర‌స్తుతం హిందీలో కంగ‌న‌ ర‌నౌత్‌ తో `మ‌ణిక‌ర్ణిక‌` సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా కోసం క్రిష్ మామూలుగా హ‌డావుడి చేయ‌డం లేద‌ట‌. బాహుబ‌లిని మించిపోయే రేంజిలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో సెట్లు వేయించాడ‌ట‌. ఎవ‌రికీ తెలియ‌డం లేదు కానీ... రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొన్నాళ్లుగా మ‌ణిక‌ర్ణిక సెట్టింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అక్క‌డ భారీస్థాయి యుద్ధ స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌బోతున్నట్టు స‌మాచారం. యుద్ధం కోసం ఆ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా భారీ సెట్టు వేయించాడ‌ట‌. రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్లంటే బాహుబ‌లి కోస‌మే వేశారు.

అయితే ఆ స్థాయిలో అక్క‌డ సెట్టు వేయించింది క్రిష్‌ మాత్ర‌మేన‌ట‌. సెట్లే కాదు... మేలుజాతి గుర్రాల్ని తెప్పించ‌డంతో పాటు - వంద‌ల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల్ని సిద్ధం చేశార‌ట‌.  ఫిల్మ్‌ సిటీకి వెళ్లిన‌వాళ్లంతా మ‌ణిక‌ర్ణిక  సెట్టు చూసి అవాక్క‌వుతున్నారు. `మ‌ణిక‌ర్ణిక` కోసం భారీగానే బ‌డ్జెట్టుని కేటాయించారు నిర్మాత‌లు. జాతీయ స్థాయి సినిమా కాబ‌ట్టి క్రిష్ కూడా భారీ హంగుల‌తో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న‌ట్టు తెలిసింది. మామూలు బ‌డ్జెట్టుతోనే `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`ని ఓ రేంజ్‌ లో తీసిన క్రిష్‌.. ఇక భారీ బ‌డ్జెట్టుని అప్ప‌జెప్పాక ఏ స్థాయిలో సినిమాని తీస్తాడో ఊహించొచ్చు. 
Tags:    

Similar News