టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్.. బాలీవుడ్లోనూ పాపులరే. అతను అక్కడ ఇంతకుముందే ‘గబ్బర్’ సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. అక్కడ మరో భారీ ప్రాజెక్టు చేసే అవకాశం అతనందుకున్నాడు. గత ఏడాది ఝాన్సీ లక్ష్మీభాయి కథతో అతను ‘మణికర్ణిక’ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఝాన్సీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకున్న సమయానికి సినిమాను రెడీ చేయలేకపోయారు. ఐతే అలాగని షూటింగ్ అవ్వలేదు అనుకోవడానికి లేదు. పనంతా అయిపోయినా ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో రాలేదట. సినిమాలో కీలకం అనుకున్న సన్నివేశాలపై క్రిష్ అండ్ కో సంతృప్తి చెందలేదట.
ఇంత ఖర్చు పెట్టి.. అంత కష్టపడి సినిమా తీసి.. కీలకమైన సన్నివేశాల విషయంలో రాజీ పడితే సినిమా ఫలితమే తేడా వచ్చేయొచ్చని భావించి.. ఆ సన్నివేశాల్ని రీషూట్ చేయడానికి నిర్ణయించుకున్నారట. ప్రతి సీన్ భారీతనంతో కూడుకున్నది కావడంతో నిర్మాతలు భారీ మొత్తంలో అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఆ రకంగా రూ.5 కోట్ల అదనపు భారం పడినట్లు సమాచారం. మళ్లీ సెట్టింగ్స్ వేసి.. కొత్తగా కాల్ షీట్లు తీసుకుని ఆ సన్నివేశాల్ని పూర్తి చేశారట. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే అయినప్పటికీ దీనిపై రూ.100 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్లు సమాచారం. మన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆగస్టులో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే బడ్జెట్ రికవరీ చేయడం అంత కష్టమేమీ కాదు. మరి మన క్రిష్ ఎలాంటి పనితనం చూపించాడో చూడాలి.