పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెలలోనే భీమ్లా నాయక్ విడుదల అవ్వడం ఖాయం. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఆ సినిమా కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ రచన సహకారం అందించిన విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా రూపొందిన సినిమానే ఈ భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించింది. భీమ్లా నాయక్ సినిమా పనులు ముగించిన పవన్ కళ్యాణ్ తదుపరి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. కరోనా థర్డ్ వేవ్ వల్ల ఆలస్యం అయిన హరి హర వీరమల్లు సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవలే దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత రత్నం వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసి షూటింగ్ పునః ప్రారంభం గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే మళ్లీ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని తాజా అప్‌డేట్స్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలోనే చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఆసక్తికర వార్త ఒకటి వినిపిస్తుంది. అదేంటి అంటే ఈ సినిమా కోసం భారీగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయిస్తున్నారట. సినిమా మొఘలాయిల కాలం నాటి కథతో రూపొందుతుంది. అందుకు సంబంధించి సన్నివేశాలను రియాల్టీ కోసం భారీ ఎత్తున వీఎఫ్‌ఎక్స్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రారంభం అయిన సమయంలోనే ఏకంగా 50 కోట్ల రూపాయలను కేవలం వీఎఫ్‌ఎక్స్ కోసం ఖర్చు చేయబోతున్నారట అంటూ వార్తలు వచ్చాయి. దర్శకుడు క్రిష్ కు వీఎఫ్‌ఎక్స్ పై మంచి పట్టు ఉంది. బాలయ్య తో క్రిష్ చేసిన గౌతమిపుత్ర శాతఖర్ణి సినిమాలో వీఎఫ్‌ఎక్స్ షాట్స్ చాలా నాచురల్ గా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు విజువల్ వండర్ ట్రీట్ ను ఇచ్చారు. ఆ సినిమాను మించి హరి హర వీరమల్లు సినిమాకు కేటాయించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు కూడా ముగింపు దశకు వచ్చాయట. ఇటీవల పవన్ తో భేటీ అయిన సమయంలో దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత రత్నం కంప్లీట్ అయిన వీఎఫ్ఎక్స్ షాట్స్ ను చూపించారట. పవన్ కళ్యాణ్ గ్రాఫిక్స్ వర్క్ కు సర్ ప్రైజ్ అయ్యాడని సమాచారం. గ్రాఫిక్స్ వర్క చాలా బాగా వచ్చిందని పవన్ దర్శకుడితో అన్నారట. క్వాలిటీ పరంగా అద్బుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించిన పవన్ తదుపరి షూట్ చేసే వీఎఫ్‌ఎక్స్ షాట్స్ కు కూడా ఇదే క్వాలిటీతో గ్రాఫిక్స్ వర్క్ చేయించాలని సూచించాడట. కాస్త సమయం తీసుకుని అయినా ఔట్ పుట్ విషయంలో ది బెస్ట్ ను తీసుకు వచ్చేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడ. ఈ సినిమా లో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ గజ దొంగ గా కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.