తన పెన్ను టాలెంటుని చూపించాడు

Update: 2018-04-06 17:25 GMT
ఒక సినిమా తెరకెక్కాలంటే స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొత్తం బాండ్ స్క్రిప్ట్ ఉంటే చాలా క్లారిటీ ఉంటుందని చాలా మంది ముందే సిద్ధం చేసుకుంటారు. మన దగ్గర దర్శకులు చాలా మంది ఉన్నారు కానీ రచయితలు మాత్రం ఎక్కువ సంఖ్యలో లేరు. ఉన్న రచయితలు కూడా డైరెక్షన్ వైపు వెళుతుండడంతో దర్శకులు రచన వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన చల్ మోహన రంగ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మాటలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. కథను మాత్రమే అందించిన త్రివిక్రమ్ ఈ సినిమాలో క్రెడిట్ మొత్తం తీసుకోకుండా డైలాగులు రాసిన కృష్ణ చైతన్య ఇమేజ్ ను పెంచాడనే  చెప్పాలి. కథ కూడా మంచి డైలాగ్ ని క్రియేట్ చేయించడంలో డిమాండ్ చేసిందని చెప్పవచ్చు. చమక్కులు.. సెన్సాఫ్ హ్యూమర్ ప్రతి సీన్లోనూ కనిపించింది.  త్రివిక్రమ్ శైలిలో కృష్ణ చైతన్య తన పెన్ను టాలెంటును చూపించాడు. మొత్తంగా మనోడు ఇరగదీసాడు అనే లెవెల్లో ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

కథను నడిపించిన విధానంలో గాని డైరెక్షన్ లో గాని ఎక్కడా తడబడకుండా తన డ్యూటీ ని కరెక్ట్ చేశాడు. దీంతో నితిన్ 25వ సినిమాలో ది బెస్ట్ డైలాగ్స్ ఉన్న సినిమాగా ఛల్ మోహన్ రంగ నిలిచిందని చెప్పవచ్చు. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు ఒక లెవెల్లో కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. మరి నెక్స్ట్ వీక్ ఇలానే కొనసాగితే నిర్మాతలకు లాభాలు అందినట్లే..
Tags:    

Similar News