సినీ ఇండస్ట్రీపై మహేష్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Update: 2020-05-11 00:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాకే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏం లాభం అంతంత మాత్రంగానే అవకాశాలు దక్కాయి.. కృతి సనన్‌ కు. ఆ చిత్రం నిరాశపరచినప్పటికీ కృతి నాజూకు అందాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'దోచెయ్' చిత్రంలో నటించగా అది కూడా నిరాశపరిచింది. రెండు వరుస పరాజయాలు పలకరించడంతో మన టాలీవుడ్ లో ఈ బ్యూటీకి అవకాశాలు లేకుండా పోయాయి. ఇక ఇక్కడ లాభం లేదని భావించిన కృతి సనన్ బాలీవుడ్ కి చెక్కేసింది.. ఈ పొడుగుకాళ్ల సుందరి. బాలీవుడ్ లో 'హీరోపంటి' 'దిల్ వాలే' 'లూకా చుప్పి' 'బరేలీకి బర్ఫీ' 'పానిపట్' 'హౌస్ ఫుల్ 4' లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు అక్కడ క్రేజీ ఆఫర్లతో బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం 'మిమి' అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ మధ్య అమ్మడికి బాలీవుడ్ అవకాశాలు సన్నగిల్లుతూ వస్తూన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది కృతి.

కృతి సనన్ సినీ రంగంలో ఉన్న నట వారసులపై కామెంట్ చేస్తూ.. టాలెంట్ ఉన్నా లేకపోయినా సినీ వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చేసింది. వారికి ఓ సినిమా ఫ్లాప్ అయితే మరో అవకాశం దక్కుతోంది కానీ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్లకు మాత్రం ఒక్క ఫ్లాప్ వస్తే మరో అవకాశం రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో బంధు ప్రీతి బాగా ఉందని.. అది చాలా తప్పని చెప్పుకొచ్చింది. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కొందరు సొంతంగా తమ కాళ్లపై నిలబడ్డారని.. కానీ కొందరు మాత్రం బ్యాగ్రౌండ్ ఉన్నా ఫెయిల్ అయ్యారని పేర్కొంది. వారసత్వం అనేది ఎంట్రీ వరకు ఉంటే ఫర్వాలేదు గానీ.. వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం సరికాదని కృతి సనన్ అభిప్రాయపడింది. వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతక ముందు కూడా చాలా మంది హీరో హీరోయిన్స్ బ్యాగ్రౌండ్ లేనివారిని బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోరని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇది ఒక్క బాలీవుడ్ కే పరిమితం కాలేదు. మన టాలీవుడ్ లో కూడా దీనిపై చాలా సార్లు వివాదాలు చెలరేగాయి. 'కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నాయని.. వారికి టాలెంట్ లేకపోయినా ఛాన్సెస్ ఇస్తుంటారని.. బ్యాగ్రౌండ్ లేనివారిని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని' చాలా మంది ఆరోపించారు. 


Tags:    

Similar News