రోషన్ 2 : పీరియాడిక్ వర్కౌట్ అయ్యేనా

Update: 2022-03-29 11:30 GMT
శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పెళ్లిసందD సినిమా తో పరిచయం అయిన విషయం తెల్సిందే. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా రోషన్‌ కు మంచి గుర్తింపు దక్కింది. పైగా హీరోగా మొదటి సినిమా నే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తో పని చేసే అవకాశం రావడంతో రోషన్‌ కెరీర్‌ ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్ అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోషన్ రెగ్యులర్‌ గా సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు.

పెళ్లిసందD విడుదల అయ్యి కొన్ని నెలలు అవుతున్న నేపథ్యంలో రోషన్‌ రెండవ సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చూపులతో.. ఆ లుక్‌ తో అమ్మాయిల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను రోషన్ దక్కించుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు రోషన్‌ రెండవ సినిమా గురించి ఎదురు చూస్తున్న సమయంలో ప్రతిష్టాత్మక తెలుగు సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లో అశ్వినీదత్‌ సినిమాను ప్రకటించాడు.

ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మాణంలో రూపొందబోతున్న సినిమా తో రోషన్‌ అసలైన హీరోయిజంను చూపించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం సోషల్‌ మీడియా ద్వారా లీక్ అయ్యి జనాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా కథ పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్‌ లో ఉంటుందట. సినిమాకు సంబంధించిన కథ మొత్తం కూడా స్వాతంత్ర్యం కు పూర్వపు పరిస్థితుల్లో ఉంటుందని అంటున్నారు.

బ్రిటీష్ వారి పరిపాలన కాలంలో ఒక వ్యక్తికి సంబంధించిన కథ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో స్వాతంత్ర్య ఉద్యమంకు సంబందించిన సన్నివేశాలు ఉండక పోవచ్చు కాని చాలా విభిన్నమైన సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. షార్ట్‌ ఫిల్మ్స్ తో మంచి పేరును సొంతం చేసుకున్న ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమా కోసం రాసుకున్న కథకు నిర్మాత అశ్వినీదత్ ఫిదా అయ్యారట.

అందుకే భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను రోషన్‌ హీరోగా నిర్మించేందుకు ఆయన సిద్దం అయ్యాడు. రోషన్‌ మొదటి సినిమా ప్లాప్‌ అయినా కూడా భారీ బడ్జెట్‌ ను అశ్వినీదత్‌ పెట్టేందుకు సిద్దం అయ్యాడు అంటే ఖచ్చితంగా కథ పై ఆయనకు ఉన్న నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈమద్య కాలంలో చాలా సినిమాలు పీరియాడిక్‌ డ్రామా తో వస్తున్నాయి. అందులో చాలా సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. మరి రోషన్‌ 2వ సినిమాకు పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ వర్కౌట్‌ అయ్యేనా చూడాలి. ఈ సినిమా లో ఒక స్టార్ హీరోయిన్‌ రోషన్ కు జోడీగా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News