పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రానికి ముందు దాదాపు మూడున్నరేళ్ల పాటు విరామం తీరుసుకున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వుండటం వల్ల పవన్ కల్యాణ్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. అయితే బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన `వకీల్ సాబ్` చిత్రంతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. దీంతో పవర్ స్టార్ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టారు.
ఈ మూవీ అందించిన జోష్ తో వరుసగా భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో ఏడాది ఒక చిత్రంలో మాత్రమే నటిస్తూ వచ్చిన పవన్ `వకీల్ సాబ్` తరువాత తన పంథాకు భిన్నంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా `భీమ్లానాయక్`తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు నేటి విటీకి అనుగుణంగా .. పవన్ ఇమేజ్ ని జోడించి తెరకెక్కించారు.
పవన్ మార్కు మెరుపులు పుష్కలంగా వుండటంతో అభిమానులు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా వుంటే `భీమ్లా నాయక్` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరింత జోష్ తో సినిమాలు చేయాలని, ఎలాంటి బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. తాజాగా చేసిన రీమేక్ `భీమ్లా నాయక్` బాక్సాఫీస్ వద్ద స్మాషింగ్ హిట్ గా నిలవడంతో పవన్ కన్ను మరో రీమేక్ పై పడింది. అదే తమిళ హిట్ చిత్రం `వినోదాయ సితం`.
సముద్రఖని నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళంలో సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకులు ప్రశంసల్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఈ మూవీ రీమేక్ లో పవన్ నటించబోతున్నారు. సముద్రఖని డైరెక్ట్ చేయనున్న ఈ మూవీకి త్రివిక్రమ్ తెరవెరనక అన్నీ తానై నడిపించనున్నారట.
వచ్చే నెల నుంచి ఈ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్లో జీ స్టూడియోస్ కూడా భాగం కావడానికి ముందు కొచ్చినట్టుగా తెలిసింది.
మేజర్ పార్ట్ ఫండ్స్ ని జీ స్టూడియోస్ అందించనుందట. ఇందు కోసం ఇప్పటికే అగ్రిమెంట్ ని కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ 20 రోజులు కేటాయించబోతున్నారట. పవన్ కల్యాణ్ కీలకంగా నిలవనున్న ఈప్రాజెక్ట్ లోకి మరో కీ రోల్ లో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ తన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ని భాగస్వామిని చేస్తున్నారట. పవన్ ఈ ప్రాజెక్ట్ కోసం 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.