'ఆదిపురుష్' కాంట్రవర్సీ: సైఫ్ పై కేసు నమోదు..!

Update: 2020-12-15 16:23 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ''ఆదిపురుష్‌'' అనే పాన్ ఇండియా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు పది తలల 'లంకేష్' గా నటించనున్నారు. అయితే ఇటీవల సైఫ్ అలీఖాన్ ఈ సినిమా గురించి వెల్లడించిన విషయాలపై వివాదం రేగింది. దీనిపై సైఫ్ అలీఖాన్ క్షమాపణ కోరినప్పటికీ వివాదం చల్లారలేదు. ఇప్పుడు సైఫ్ మరియు దర్శకుడి పై కేసు నమోదు చేయబడింది.

లాయర్ హిమాన్షు శ్రీవాత్సవ సైఫ్ అలీఖాన్ మరియు ఓం రౌత్ పై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం రాముడిని మంచికి చిహ్నంగా రావణుడిని చెడు కి గుర్తుగా చెప్పుకుంటారని.. అయితే సైఫ్ స్టేట్మెంట్ ని బట్టి దానిని వక్రీకరిస్తున్నారనే నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ కోర్టులో ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 23న ఈ కేసు విచారణకు రానుంది. దీనిపై 'ఆదిపురుష్‌' మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, ఇటీవల సైఫ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ రాక్షస ప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో సీతని అపహరించినందుకు రామునితో రావణుడికి మధ్య యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను.. తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు అతను చేసే ప్రయత్నాలు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌ గా మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇది కాంట్రవర్సీ అవడంతో సైఫ్ అలీఖాన్ క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News