నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో చేస్తున్న హంగామా చూస్తున్నదే. అయితే పాన్ ఇండియా లైగర్ టీజర్ ఈ రోజు రిలీజవుతుందని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ టీజర్ ని ఇప్పుడున్న అనిశ్చితిలో రిలీజ్ చేయలేమని మరో కొత్త తేదీని వెల్లడిస్తామని దేవరకొండ అండ్ టీమ్ ప్రకటించారు.
విజయ్ మొదటి పాన్ ఇండియా చిత్రం LIGER (సాలా క్రాస్‌బ్రీడ్) టీజర్ ను విడుదల చేయాలని సిద్ధం చేశాం. తన పుట్టినరోజు స్పెషల్ గా ఈ రోజు పవర్ ప్యాక్డ్ టీజర్ ను విడుదల చేయాలనుకున్నా కొనసాగుతున్న మహమ్మారీ కల్లోలం వల్ల ఆ పని చేయలేకపోతున్నాం. ఒక మంచి సమయంలో ప్రపంచానికి చూపించాలనే ఆశతో టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నామని టీమ్ ఒక స్పెషల్ నోట్ లో తెలిపింది.
``ఈ పరీక్షా సమయంలో మీరంతా ఇండ్లలోనే ఉండాలి. మిమ్మల్ని మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని మేము ఆశిస్తున్నాము. మే 9న LIGER పవర్ ప్యాక్డ్ టీజర్ విడుదల చేయాలని మేమంతా సన్నద్ధమయ్యాం. కానీ మన దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత కల్లోల వాతావరణం కారణంగా ఇది సరికాదని భావించాం`` అని నోట్ లో వెల్లడించారు. లైగర్ లో మునుపెప్పుడూ చూడనంత కొత్తగా విజయ్ దేవరకొండను చూస్తారని హామీ ఇస్తున్నాం. కాస్త వేచి ఉండండి. అందుకు నిరాశపరచం. త్వరగా టీకాలు వేయించండి. వైద్య బృందాలు సూచించిన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి. మనం ఒక కుటుంబంగా ఒక దేశంగా.. బలంగా ఉన్నప్పుడు త్వరలో థియేటర్లలో కలుద్దాం`` అని నోట్ లో వెల్లడించారు.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా కనిపిస్తాడు. ఆ మేరకు మార్షల్ విద్యల్లో శిక్షణ పొందారు. విజయ్ పూర్తిగా కొత్త రూపంతో అలరిస్తారు. బాలీవుడ్ నటి అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ -ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్- చార్మి కౌర్- కరణ్ జోహార్ - అపుర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషలలో రూపొందుతున్న లైగర్ లో రమ్య కృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.