మొన్న లయన్ సినిమా ప్రమోషన్‌కు వచ్చి.. 'లెజెండ్' సినిమా 60 వారాల పోస్టర్ రిలీజ్ చేశాడు నందమూరి బాలకృష్ణ. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. లెజెండ్ ఇంకా ఆడుతుండగానే 'లయన్' సినిమాను చాలా చోట్ల లేపేస్తున్నారు. సినిమాకు అలాంటి టాక్ వచ్చింది మరి. రెండో వారం మూడు సినిమాలు థియేటర్లలో దిగిపోవడంతో 'లయన్' బండి నడవడం చాలా కష్టంగా ఉంది. బాలయ్య గత సినిమాలతో పోలిస్తే ఓపెనింగ్స్ చాలా వీక్‌గా వచ్చాయని ఇంతకుముందే తేలిపోయింది. తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.5 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఐదో రోజు కూడా కలెక్షన్లు పర్వాలేదనిపించడంతో.. 'లయన్' బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరగా వస్తుందేమో అన్న ఆశలు రేగాయి. కానీ 6, 7 రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏడో రోజైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ.30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక శుక్రవారం మూడు సినిమాలు దాడి చేశాక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎండలు మండిపోతుండటంతో తొలి రెండు షోలకు అసలు థియేటర్లకే రావట్లేదు జనాలు. లయన్ థియేటర్లయితే మరీ వెలవెలబోతున్నట్లు సమాచారం. మొత్తానికి రెండో వీకెండ్ తర్వాత 'లయన్' థియేటర్లలో నిలవడం చాలా కష్టమే అనిపిస్తోంది. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా షేర్.. రూ.15-16 కోట్ల మధ్య ఉంది. ఫుల్ రన్‌లో రూ.20 కోట్ల మార్కును అందుకున్నా అద్భుతమే అంటున్నారు. ఓ ఏడెనిమిది కోట్ల దాకా లాస్ తప్పేట్లు లేదు.