లోకేష్ యూనివర్స్ లో విజయ్ హై స్పీడ్!

Update: 2023-01-03 01:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా విడుదలయ్యే కంటే ముందుగానే వెంటనే మరొక సినిమాను మొదలు పెడుతూనే ఉంటాడు. అతను ఎక్కువగా గ్యాప్ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడు. ఒకసారి దర్శకుడిని నమ్మితే అతన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాడు. ఏదైనా సరే స్క్రిప్ట్ చర్చల దశలోనే ఫైనల్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

విజయ్ ఒక్కసారి ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని కూడా అతను అనుకుంటాడు. అలాగే నిర్మాతలపై కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా పడకుండా చూసే హీరోలలో విజయ్ ఒకడు అని తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. అయితే విజయ్ వారసుడు సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా విడుదల కంటే ముందుగానే తన 67వ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు. సోమవారం రోజు చెన్నైలోనే ఒక స్పెషల్ సెట్లో లోకేష్ దర్శకత్వంలో తన మొదటి షాట్ లో విజయ్ నటించాడు. ఇక లోకేష్ కనగరాజ్ తమిళ ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఒక అతిపెద్ద మల్టీవర్స్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక విజయ్ తో అతను మాస్టర్ క్యారెక్టర్ ను కంటిన్యూ చేస్తాడా లేదంటే మరో కొత్త క్యారెక్టర్ సృష్టిస్తాడా అనేది విషయంలో ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తలపతి 67వ సినిమాలు మాత్రం ఈ ఏడది సమ్మర్ చివరిలోపు ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. ఇక సినిమా విడుదలపై కూడా ఒక చర్చ కొనసాగినట్లు తెలుస్తోంది.

2023 దీపావళి సమయానికి తలపతి 67వ సినిమాను విడుదల చేయాలని కూడా అనుకున్నారట. లోకేష్ కూడా ఆలస్యం చేయకుండా షూటింగ్ పనులను పూర్తి చేయడంలో ముందుంటాడు. అతను విక్రమ్ సినిమాను కూడా అనుకున్న సమయం కంటే వేగంగానే పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు విజయ్ 67వ సినిమాను కూడా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక విజయ్ కూడా అతనికి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇవ్వబోతున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News