టాలీవుడ్ లో ఏదైనా ఒక పెద్ద సినిమా విడుదలవుతుందంటే వారం రోజుల ముందు నుండీ ప్రమోషన్లతో ప్రేక్షకులను ఊపిరాడనివ్వకుండా చెయ్యడం సినీ వర్గాలకు కొట్టిన పిండి. అలాంటి సినిమాలు టాక్ తెలియకముందే టికెట్లు బుక్ అవ్వడం - సినిమా ఫైనల్ కాపీ చూడకుండానే డిస్ట్రిబ్యూటర్లు కొనుగోళ్ళ చేయడం సాధారణ విషయం.
అయితే చిన్న సినిమాల వ్యవహారం దీనికి పూర్తిగా భిన్నం. చిన్న సినిమాలలో మంచి కంటెంట్ వున్నా అవి ఒకటి ఆరా థియేటర్ లలో విడుదలై మంచి విజయం సాధించిన తరువాత మౌత్ టాక్ ని బట్టి కలెక్షన్లు - థియేటర్ల సంఖ్యా పెరుగుతుంది. ఇటీవల విడుదలైన బిచ్చగాడు సినిమా దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమాలకు సైతం ముందు నుండే వెరైటీ ప్రమోషన్ల బాట పడుతున్నారు సదరు సినీ వర్గాలు.
ఈ వారం విడుదల కానున్న పెళ్లిచూపులు సినిమా ఇప్పటికే తెలంగాణా - ఆంధ్రా రాష్ట్ర మీడియా మిత్రులకు ప్రత్యేకంగా షో వేసి - వాళ్ళని మెప్పిస్తే సినిమాను ప్రమోట్ చెయ్యమంటున్నారు. సినిమాలో కంటెంట్ బాగానే ఉండడంతో ప్రమోషన్ కూడా బానే వస్తుంది. దీంతో విడుదలకాకుండానే ఒక చిన్న సినిమాకు మంచి టాక్ రావడం గమనార్హం. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న నిర్మల కాన్వెంట్ సినిమాకు నాగార్జున అండగా నిలిచి తాను చెయ్యగలిగినది చేస్తున్నాడు. విడిగా వస్తే పెద్దగా ఆకర్షించలేని సినిమాలు ఈ విధంగా ప్రమోషన్ల బాట పట్టడం కొత్త సంస్కృతనే చెప్పాలి.