భారత్ ను బాగ్దాద్ చేయకండి.. మాధవీలత సంచలనం

Update: 2019-12-25 09:16 GMT
పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. ఇప్పుడు జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే పౌరసత్వ మంటలు చల్లారలేదు. ఈ నేపథ్యంలో ఎన్నార్సీ అమలైతే ఇంకా ఎంత ఉపద్రవం వస్తుందో తెలియని పరిస్థితి. ఈ వివాదంపై తాజాగా బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. అవిప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా ఎన్నార్సీపై మాధవీలత ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. ‘సిరియా నుంచి బెల్జియంకు వలసవచ్చిన ముస్లింలు ఇప్పుడు ఆ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చేస్తున్నారని.. భారత్ కు కూడా ఇతర దేశాల నుంచి ముస్లింలు వస్తే మైనార్టీలు మెజారిటీలుగా మారిపోతారని’ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మెజార్టీగా ఉన్న దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలు అయ్యాయని.. ఇలా 67దేశాలు ఇస్లామిక్ దేశాలుంటే ఇంకా ఈజిప్ట్, బెల్జియంలను ముస్లిం దేశాలుగా మార్చేస్తున్నారంటూ మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. ముస్లింలకు ఆశ్రయం ఇచ్చిన బెల్జియం ప్రజలు ఇప్పుడు అక్కడ వారు అధికారం చెలాయించి ఆధిపత్యం చెలాయిస్తుంటే బాధపడుతున్నారని ఆమె వాపోయారు.బెల్జియంను ముస్లిం దేశంగా ప్రకటించాలని అక్కడ ముస్లింలు ఆందోళన చేస్తుంటే బెల్జియం వాసులు నలిగిపోతున్నారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.

బెల్జియం ఉందంతం చూసైనా భారత్ లోని సెక్యులర్ జీవులు మేల్కొనాలని.. ప్రపంచంలో హిందువులున్న ఏకైక దేశం భారత్ యేనని దాన్ని ముస్లిం, క్రిస్టియన్లకు కట్టబెట్టవద్దంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ముస్లింలను గెలిపించి అధికారమిస్తే భారత్ కూడా బాగ్దాద్ అవ్వడానికి ఇంకెంతో దూరంలో లేదు అని మాధవీలత హెచ్చరిస్తూ సంచలన పోస్టు పెట్టింది. ఇప్పుడీ పోస్టు వైరల్ గా మారింది.
    

Tags:    

Similar News