వాటే సేవ.. మహానుభావా?

Update: 2017-10-06 10:01 GMT
మోడీ సర్కార్ స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా గాంధీ జయంతి నుంచి మళ్లీ ఈ ఉద్యమం బాగానే ఊపందుకుంది. దేశ సేవ.. పరిశుభ్రత ఎంత అవసరమో చెప్పే ఈ కార్యక్రమానికి మహానుభావుడు టీం మద్దతు తెలిపింది.  రీసెంట్ గా మహానుభావుడు యూనిట్ అంతా కలిసి హైద్రాబాద్ లోని శ్రీనగర్ కాలనీ రోడ్లను ఊడ్చి శుభ్రం చేసి.. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అయితే.. ఇంత సడెన్ గా దేశం మీద సేవ ఎందుకు గుర్తొచ్చిందా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏ సిట్యుయేషన్ ని అయినా ప్రచారం కోసం వాడేసుకోవడం ఈ మధ్య మన సినిమా జనాలకు బాగానే అలవాటయిపోయింది. ఎలాగూ మహానుభావుడు మూవీ దిగ్విజయంగా రన్ అవుతోంది. థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. రెండో వారంలో స్క్రీన్ కౌంట్ కూడా పెరిగిందంటే.. సినిమాకి జనాల నుంచి ఆదరణ ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ప్రచారం చేసుకుంటే మరింతగా వసూళ్లు వస్తాయి. కానీ పెయిడ్ ప్రమోషన్స్ కంటే ఇలా స్వచ్ఛ్ భారత్ లాంటి కార్యక్రమాల ద్వారా మరింతగా గుర్తింపు పొందొచ్చు. పైగా ఫ్రీ పబ్లిసిటీ కూడా వచ్చేస్తుంది.

అటు దేశానికి సేవ చేశామన్న తృప్తి ఎలాగూ ఉంటుంది. ఇటు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న తమ మూవీకి మరింతగా హెల్ప్ చేసినట్లు అవుతుంది. అందుకే హీరో శర్వానంద్.. దర్శకుడు మారుతి సహా మహానుభావుడు టీం అంతా స్వచ్ఛ్ భారత్ లో మహా ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags:    

Similar News