టైటిల్ విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలయితే.. మిగిలిన స్టార్స్ టైటిల్స్ తో మ్యాచ్ కాకుండా జాగ్రత్త పడతారు. అలాగే.. ఓ సినిమా టైటిల్ ని.. వాళ్ల వారసులో, కమెడియన్సో వాడుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మెగాస్టార్ సినిమా టైటిల్ తో.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది.
చట్టంతో పోరాటం అనే టైటిల్ తో చిరంజీవి మెగాస్టార్ కాకముందే ఓ మూవీ చేశారు. 1985లో రిలీజ్ అయిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాధవి - సుమలత నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం చేస్తున్న మహేష్ బాబు.. తర్వాత మురుగదాస్ తో చేయబోయే సినిమాకి ఇదే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. మురుగదాస్ సినిమా అంటేనే.. ఏదో ఒక సామాజిక సమస్య చుట్టూ అల్లుకున్న కమర్షియల్ నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు మహేష్ తో చేయనున్న మూవీని.. న్యాయ వ్యవస్థలోని లోపాలు - లొసుగులు బైట పెట్టనున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి చట్టంతో పోరాటం అనే టైటిల్ అయితే బాగుంటుదన్నది డైరెక్టర్ ఆలోచన.
సూపర్ స్టార్ డబుల్ రోల్ చేస్తాడనే టాక్ వినిపిస్తున్న ఈ మూవీపై అయితే క్లారిటీ ఉంది కానీ.. టైటిల్ విషయంలో మాత్రం ఇంకా ఫైనల్ డెసిషన్ మాత్రం రాలేదు. ఒక వేళ ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే మాత్రం.. మహేష్ బాబు కొత్త సాంప్రదాయానికి తెర తీసినట్లే.