డాడ్ సినిమాకి సీతా పాప ప్ర‌చారం

Update: 2019-12-21 06:18 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్.. ప్ర‌చార చిత్రాలు సినిమాపై  అంచ‌నాలు పెంచాయి. అటు సోష‌ల్ మీడియాలో స‌రిలేరు ప్ర‌చారం అదే రేంజ్ లో జ‌రుగుతోంది. ఇక ప్రీ రిలీజ్ వేడుక‌క‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. సూప‌ర్ స్టార్- మెగాస్టార్ ల‌ను ఒకే వేదిక‌పై చూసే అదృష్టం జ‌న‌వ‌రి 5న ఇరువురి అభిమానుల‌కు క‌ల‌గ‌బోతోంది. మెగా సూప‌ర్ ఈవెంట్ ఇది అంటూ అనీల్ రావిపూడి ప్ర‌చారం వేడెక్కిస్తున్న సంగ‌త తెలిసిందే.

ఇదంతా ఒకెత్తు! అనుకుంటే.. స‌రిలేరు టీమ్ కి సీతా పాప చేస్తున్న ప్ర‌చార సాయం మామూలుగా లేదు.  మ‌హేష్ -న‌మ్ర‌త‌ల గారాలప‌ట్టి సితార ( సీతాపాప‌) అదిరిపోయే డ్యాన్సుల‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి  బోలెడంత ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతోంది. ఈ సినిమాలో  హీ ఈజ్ సో క్యూట్! సాంగ్ ఇప్ప‌టికే  శ్రోతల్ని అల‌రిస్తోంది. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో న‌లిచింది.  టిక్ టాక్ వెర్ష‌న్స్ అంతే జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కుముందు ఈ పాట టీజ‌ర్ విడుద‌లైంది. ర‌ష్మిక అదిరిపోయే స్టెప్పు వేసిన ఆ వీడియో మీడియాలో అంతే వైర‌ల్ అయ్యింది.

ఈ నేప‌థ్యంలో స‌తీపాప కూడా `హీ జ్ సో క్యూ..` అంటూ క్యూల్ ల‌వ్ లీ డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకున్న‌ ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది. యువ‌త‌రంలో సీత పాప వీడియో జోరుగా వైర‌ల్ అవుతోంది. క్యూట్ క్యూట్ గా.. ముద్దు ముద్దుగా ఆ స్టెప్పులు చూడాలంటే రెండు క‌ళ్లు స‌రిపోవు! నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు. స‌రిలేరు హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌ను మించి సీత పాప డ్యాన్సులు అదుర్స్ అంటూ అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. సూప‌ర్ స్టార్ డాట‌రా! మ‌జాకానా!

Tags:    

Similar News