అభిమానులకు తొందరెక్కువయ్యిందే

Update: 2019-03-06 14:30 GMT
వెనకటికో సామెత ఉంది. ఆలు లేదు చూలు లేదు సంతానం పేరు ఏదో పెట్టుకున్నారట. అలా ఉంది మహేష్ బాబు 26వ సినిమా గురించి అభిమానులు ప్రదర్శిస్తున్న తొందర చూస్తుంటే. కేవలం ఇప్పటిదాకా లైన్ మాత్రమే ఓకే అయ్యింది. పిఆర్ ట్వీట్ చేసాడు కానీ ఈ సినిమా నేను చేస్తున్నాను అని మహేష్ స్వయంగా ప్రకటించలేదు. అలా అని ఉండదని కాదు. ఖచ్చితంగా ఉంటుంది. కాని ముందు మహర్షి పూర్తవ్వాలి. ఇప్పటికే రెండు డేట్లు మారాయి. ఏప్రిల్ 5 ముందు 25గా మారింది. ఇందాకా ఏకంగా మే 9కి షిఫ్ట్ అయ్యింది.

ఇకపై మార్పు ఉండకపోవచ్చు. మహేష్ కు ఈ టెన్షన్ తొలుత తీరాలి. బాలన్స్ షూటింగ్ పూర్తి చేసి ఆ పై ప్రమోషన్ గురించి ప్లాన్ చేసుకోవాలి. ఏడాది గ్యాప్ కాబట్టి ప్రీ రిలీజ్ మాములుగా చేస్తే సరిపోదు. భరత్ అనే నేనుకి స్టేడియం సరిపోలేదు. ఈ సారి ఓపెన్ గ్రౌండ్ అవసరమేమో. ఇవి కాకుండా సెన్సార్ ఫార్మాలిటీస్ బిజినెస్ డీల్స్ ఒకటా రెండా చాలా వ్యవహారాలు ఉన్నాయి

ఇవన్ని పక్కనబెట్టి మహేష్ ఇప్పుడు అర్జెంట్ గా అనిల్ రావిపూడి సినిమాకు హీరొయిన్లు ఎవరు ఉండాలి షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే ఆలోచనలో లేడు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ రెడీ అవ్వనే లేదు. మొత్తం చెప్పిన సుకుమార్ దే చివరి స్టేజిలో బాలేదన్న మహేష్ గుడ్డిగా అనిల్ నైనా నమ్మేస్తాడు అనుకోలేం. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా వస్తేనే సెట్స్ పైకి చెప్పిన టైంకి వెళ్తుంది.

బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ పూర్తిగా మొహమాటాలను పక్కనపెట్టేసినట్టు సన్నిహితులు చెబుతారు. రేపు తనకు మెచ్చేట్టు ఫుల్ వెర్షన్ వినిపిస్తేనే చెప్పిన టైంకు అనిల్ సినిమాను మొదలుపెట్టిస్తాడు మహేష్. అంతే తప్ప ఊరికే రాజీ పడే అవకాశం ఉండదు. కానీ ఈ లోపు సోషల్ మీడియాలో మా హీరో పక్కన ఆ హీరోయిన్ వద్దు ఈ అమ్మాయి సూట్ కాదు అంటూ ట్రెండింగ్ చేయడం ట్వీట్లు పెట్టడం అంతా తొందరపాటు వ్యవహారమే
  


Tags:    

Similar News