ప్రిన్స్ సినిమాలో జల్లికట్టు ‘సీన్’

Update: 2017-02-21 16:09 GMT
ఆ మధ్య వరకూ జల్లికట్టు అంటే అంత ఫేమస్ కాదనే చెప్పాలి. తమిళులకు సుపరిచితమైన ఈ ఆట.. తెలుగునాట విశేషంగా చర్చ జరగటమేకాదు.. జల్లికట్టుకు అనుకూలంగా కొందరు..వ్యతిరేకంగా కొందరు చీలిపోయి.. వాదనల మీద వాదనలు జోరుగా చేసుకున్న పరిస్థితి. జల్లికట్టు సందర్భంగా తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన ప్రిన్స్ మహేశ్ బాబు లాంటోడు సైతం.. ట్విట్టర్ లో ట్వీట్ చేసేసి.. తన మద్దతును ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది.

ట్విట్టర్ లో ఫ్యామిలీ ముచ్చట్లు.. పిల్లల ఫోటోలతో కామ్ గా ఉండే మహేశ్ బాబు లాంటోడు.. జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాట్లాడిన మహేశ్.. తాజాగా తన సినిమాలోనూ జల్లికట్టు ముచ్చట తీసుకురానున్నారు. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న చిత్రంలో జల్లికట్టు ప్రస్తావన తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.

అలా అని జల్లికట్టు ఆటను చూపించరు కానీ.. ఆ ఆట కోసం తమిళ ప్రజలు స్పందించిన తీరు.. మెరీనా బీచ్ లో నిర్వహించి శాంతియుత ఆందోళనతో మురగదాస్ లో కొత్త ఐడియాలు వచ్చాయని.. ప్రజలు నిస్తేజంగా ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ.. అవసరమైనప్పుడు తమ స్పందనను ఎంత భారీగా ప్రదర్శించటానికి జల్లికట్టు ఉదంతమే నిదర్శనంగా చెబుతున్నారు.

దీంతో.. ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. క్లయిమాక్స్ లో హీరోకు జనం అండగా నిలిచే సీన్లను.. జల్లికట్టు ఆందోళనలకు తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులుచేయనున్నట్లుగా చెబుతున్నారు. తమిళ.. తెలుగు భాషల్లో తీస్తున్న ఈ సినిమాను.. తాజా సంచలనమైన జల్లికట్టు ప్రస్తావన ఉంటే ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News