సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిస్థాయిలో నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో 'శ్రీమంతుడు' సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించినప్పటికీ ఈ సారి సోలో ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు మహేష్. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ద్వారా తొలి ప్రయత్నంగా 'మేజర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 26/11 సంఘటనలో తీవ్రవాదులతో పోరాటం చేసూ నేలకొరిగిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఇది. ఈ సినిమాలో ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాణం గురించి.. తన కొత్త సినిమా 'మహర్షి' గురించి పలు విషయాలను పంచుకున్నారు మహేష్. మీరు ఎందుకు నిర్మాత గా మారారు అని అడిగితే "నేను యాక్టివ్ ప్రొడ్యూసర్ కాదు.. జీఎంబీ ప్రొడక్షన్ హౌస్ ను ఒక ప్రతిభావంతులున్న టీమ్ మేనేజ్ చేస్తుంది. నాకు సినిమా... సినిమాకు సంబంధించినవన్నీ ఇష్టం. కొన్ని సార్లు మంచి స్టొరీలు ఉంటాయి.. కానీ అన్నీ స్టొరీలలో నేను నటించలేను కదా?" అన్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో మీరు నటించడం మీకు ఓకేనా? అని అడిగితే సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించడం ఒక గౌరవమని.. కాకపోతే ఈ స్టొరీతో శేష్ చాలా రోజుల నుండి ట్రావెల్ చేస్తున్నాడని తెలిపారు. అడివి శేష్ ఆయన పాత్రకు చక్కగా సరిపోతాడని.. సినిమాలో శేష్ ఎలా చేస్తాడో చూడాలని ఉందని మహేష్ అన్నారు.
మీరు గత పదేళ్ళుగా యువకుడిలా 30 ఏళ్ళ వ్యక్తిలా కనిపిస్తున్నారు.. సీక్రెట్ ఏంటి? అని అడిగితే "హెల్దీ లైఫ్ స్టైల్.. ఫుడ్ - ఎక్సర్ సైజుల విషయంలో క్రమశిక్షణ.. పాజిటివ్ థింకింగ్.. పాజిటివ్ లివింగ్.. అంతే" అన్నారు. 'మహర్షి' సినిమా గురించి అడిగితే "నేను చేసే ప్రతి సినిమాకు 100% కంటే ఎక్కువగా ఎఫర్ట్ పెడతాను. మా టెక్నిషియన్లు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. దేన్నీ తేలిగ్గా తీసుకోము" అన్నారు. తెలుగులో మీరు పెద్ద చాలా పెద్ద స్టార్.. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అని అడిగితే "రాజకీయాలు నాకు సంబంధించినవి కావు. నాకు అవి అర్థం కూడా కావు. మనకు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు .. వారు చక్కగా పని చేస్తున్నారు. వాటిని మార్చాలనే ఆలోచన నాకు లేదు. నాకు యాక్టింగ్ అంటే ప్రేమ. నాను నా జాబ్ ఇష్టం.. నేను అందులో బెస్ట్. నేను అది మార్చాలనుకోవడం లేదు" అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి ఫ్యామిలీ .. ఫ్యాన్సే కారణం అన్నారు.