దాదాపు నెల రోజుల నుండి యురోపియన్ గాలినే పీల్చుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేనండీ.. మనోడు లండన్ హాలిడే లో ఉన్నాడు. అయితే లండన్ లో మొదలైన వీరి హాలిడే చివరకు యరోప్ అంతా చుట్టొచ్చేలా చేసేసింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ తిరిగొచ్చినట్లు తెలుస్తోంది.
మే 20న బ్రహ్మోత్సవం రిలీజయ్యాక తన ఫ్యామిలీతో కలసి హాలీడే కు వెళ్ళాడు మహేష్. యథావిథిగా వైఫ్ నమ్రతా శిరోద్కర్ - పిల్లలు గౌతమ్ అండ్ సితారతో కలసి.. లండన్ బయలుదేరాడు మహేష్ బాబు. లండన్ చూసుకున్నాక.. స్కాట్లాండ్ - ఐర్లాండ్ దేశాల్లోని అనేక ప్రాంతాల్లో విహరించి.. తరువాత ఆస్ర్టియా వెళ్లారు. అక్కడ అల్టావ్సీ వంటి నగరాల్లో విహరించి.. తిరిగి స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నగరానికి విచ్చేశాడు. ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. పర్వతాల్ మధ్యలో క్రూజ్ షిప్పులపై విందులు ఆరగిస్తూ.. బెవేరియన్ పర్వతశ్రేణుల్లో ట్రెక్కింగ్ చేస్తూ.. అబ్బో బాగానే ఎంజాయ్ చేశారు మహేష్ అండ్ ఫ్యామిలీ. ఫుల్ గా రీఫ్రెషయ్యి ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు.
ఇక త్వరలోనే ఏ.ఆర్.మురుగదాస్ సినిమా తాలూకు పనులు మొదలెట్టేస్తాడట మహేష్.