మ‌హేష్ కి షిర్డీ సాయినాథుని ఆశీస్సులు

Update: 2019-12-29 14:52 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. మ‌హేష్ త‌న పార్ట్ డ‌బ్బింగ్ పూర్తి చేసుకుని ఫ్రీ అయ్యారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న షిర్డీ సాయినాధుని ద‌ర్శ‌నానికి వెళ్లార‌ని తెలుస్తోంది. షిర్డీ ద‌ర్శ‌నం అనంత‌రం ఆయ‌న కుటుంబ స‌మేంతంగా ముంబై విమానాశ్ర‌యంలో దిగిన ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

షిర్డీ ద‌ర్శ‌నంలో మ‌హేష్‌- న‌మ్ర‌త తో పాటుగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కూడా ఉన్నారు. ఇక ఆధ్యాత్మికం ప‌రంగా బాబా ద‌ర్శ‌నం అనంత‌రం వారం రోజుల పాటు ముంబై లో ఫ్యామిలీతో గడప‌నున్నార‌ని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 5న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ప్రీరిలీజ్ వేడుక‌కు మహేష్ తిరిగి వ‌స్తారు. ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి తో క‌లిసి వేదిక‌పై మ‌హేష్ సంద‌డి చేయ‌నున్నారు.

మహేశ్‌బాబు సరసన రష్మిక‌ మందన్నా క‌థానాయిక‌గా న‌టించ‌గా రాజేంద్ర ప్ర‌సాద్ ఓ కీల‌క పాత్రను పోషించారు. ప్ర‌కాష్ రాజ్ ఇందులో విల‌న్ గా న‌టించారు. లేడీ సూప‌ర్ స్టార్ విజయశాంతి మ‌హేష్ కి ధీటైన‌ పాత్రలో న‌టించారు. దిల్‌ రాజు- అనిల్‌ సుంకర- మహేశ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.


Tags:    

Similar News